సుష్మా, ధనుష్ వీరిద్దరు ప్రేమికులు. గత రెండళ్ల నుంచి పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారు. ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంత మారిపోయారు. ఇక ఎలాగైన పెళ్లి చేసుకోవాని కలలు కన్నారు. కానీ మొదట్లో వీరి ప్రేమను తల్లిదండ్రులు నిరాకరించారు. పట్టుబట్టిన ఈ ప్రేమ జంట మొత్తానికి ఇరు కుటుంబాలను ఒప్పించారు. దీంతో పెళ్లికి అంతా సిద్దంగా చేసుకున్నారు. కట్ చేస్తే రోడ్డు ప్రమాదానికి గురై ప్రియుడు మరణించగా, దీనిని తట్టుకోలేన ప్రియురాలు ఆత్మహత్య చేసుకుంది. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన కన్నీరును తెప్పిస్తుంది.
అసలు హృదయ విదారక ఘటన ఎక్కడ జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. అది కర్నాటక తుమకూరు తాలూకాలోని ఆరేహళ్లి గ్రామం. మస్కల్ గ్రామానికి చెందిన ధనుష్ అనే యువకుడు బెంగళూరులో బట్టల షాపును నడుపుతున్నాడు. ఇక ఈ నేపథ్యంలోనే ధనుష్ కి సుష్మా అనే యువతితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త చివరికి గాఢమైన ప్రేమగా మారింది.
ఇది కూడా చదవండి: Hyderabad: స్విమ్మింగ్‌పూల్ నిర్వహుకుల నిర్లక్ష్యం.. బాలుడి మృతి
ఇక ఇదే విషయాన్ని పెళ్లి చేసుకోవాలనుకుని పెద్దలకు చెప్పగా మొదట్లో నిరాకరించారు. అయితే పట్టుబట్టి ఒప్పించారు. త్వరలోనే ముహూర్తాలు పెట్టుకోవాల్సి ఉంది. అయితే ఈ నెల 11వ తేదీన గ్రామంలో జరిగే జాతరలో పాల్గొనడానికి ధనుష్ బైక్‌పై వస్తుండగా నెలమంగల దగ్గర ఉన్న కులానహళి వద్ద రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో ధనుష్ ప్రాణాలు కోల్పోయాడు.
ఈ విషయం తెలుసుకున్న ప్రియురాలు కన్నీరు మున్నీరుగా విలపించింది. దీంతో ప్రియుడి మరణాన్ని జీర్ణించుకోలేని ప్రియురాలు తెల్లారేసరికి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా విషాదంగా మారింది. ఈ విషాద ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.