విషాదం: తండ్రి కారు కింద పడి కుమారుడు మృతి!

child died crime

విధిరాత ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవ్వరూ ఊహించలేరు. కొడుకుని అలలను ముద్దుగా పెంచుకుంటున్న ఓ తండ్రి చేతుల్లోనే ఆ బిడ్డ కన్నుమూసిన ఘటన హైదరాబాద్ లోని ఎల్బీ నగర్ లో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌కు చెందిన లక్ష్మణ్, రాణి దంపతులు. ఈ దంపతులు వాచ్ మెన్ గా జీవిస్తూ వస్తున్నారు. అపార్ట్మెంట్ వ్యవహారాలు అన్నీ రాణి చూసుకుంటూ ఉంటుంది. లక్ష్మణ్ కారు డ్రైవర్ గా పని చేస్తూ వస్తున్నారు. కాగా.. వీరికి వివాహం అయ్యి 5 సంవత్సరాలు అవుతోంది. వీరికి భవాని అనే నాలుగేళ్ల కూతురు, సాత్విక్ అనే ఏడాదిన్నర కుమారుడు ఉన్నారు. ఉన్నంతలో జీవితం ప్రశాంతంగా వెళ్ళిపోతుంది అనుకున్న తరుణంలో ఈ కుటుంబలో దారుణం చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..

ఎల్బీ నగర్‌లోని మన్సురాబాద్ కాస్మోపాలిటన్ కాలనీ‌లో ఓ అపార్ట్ మెంట్‌లో లక్ష్మణ్ వాచ్ మెన్‌ కమ్ కారు డ్రైవర్. దీంతో అపార్ట్ మెంట్‌లో ఓ కారు‌ని శుభ్రం చేసి ముందుకు తీసే క్రమంలో తన కుమారుడు సాత్విక్ ఆడుకుంటూ కారు ముందు చక్రాల కిందికి వచ్చాడు. ఇది గమనించని లక్ష్మణ్ కారును అలాగే ముందుకు పోనిచ్చాడు. ఈ దుర్ఘటనలో అతని కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి

గాయాలు అయిన బాలుడిని కుటుంబ సభ్యులు వెంటనే కామినేని హాస్పిటల్‌కు తరలించారు. కానీ.., అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు అప్పటికే సాత్విక్ మృతి చెందినట్లు చెప్పారు. కాగా.. తన కన్న కొడుకునే తానే పొట్టన పెట్టుకున్నాను అంటూ తండ్రి లక్ష్మణ్ రోదించడం అందరిని కలచి వేస్తోంది. మరి. చూశారు కదా? ఈ విషాద ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.