తిరుపతిలో హైటెక్ వ్యభిచారం: వాట్సాప్‌లో బేరం! ఫ్యామిలీ ఆంటీలు కూడా!

High Tech Prostitution Racket Caught By Tirupati Police -Suman TV

తప్పు చేయాలి అనుకునే వారికి స్థలంతో సంబంధం లేదు. మంచి చెడులు అవసరం లేదు. ఇలా మనీ వేటలో పడి.., తప్పుడు మార్గాలలో పయణిస్తున్న వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతూ వస్తుంది. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని ఆధ్యాత్మిక నగరం తిరుపతి పట్టణం కొందరు కేటుగాళ్లు అసాంఘిక కార్యక్రమాలకి వేదిక అయ్యింది. తిరుపతి నగరంలో గుట్టుగా సాగుతున్న హైటెక్ వ్యభిచార దందా గుట్టును పోలీసులు రట్టుచేశారు. ఆ వివరాల్లోకి వెళ్తే..,

తిరుపతి శ్రీనగర్ కాలనీ ఎంత ప్రశాంతంగా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఆ ప్రాంతంలో ఇల్లు అద్దెకి తీసుకుని హైటెక్ వ్యభిచారంకి తెర లేపారు కొందరు ప్రబద్దులు. వాట్సాప్‌ ద్వారా విటులను ఆకర్షించడం, అందులోనే రేటు ఫిక్స్ చేసుకోవడం, అనువైన తేదీన కలుసుకోవడం.. ఇలా అంతా గుట్టుగా సాగిపోతూ వచ్చింది వీరి వ్యవహారం. అయితే.., ఈ ప్రాంతంలో జోరుగా వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందటంతో వారు రంగంలోకి దిగారు. తాజాగా ఈ మంగళవారం ఆ ఇంట్లో ఆసస్మికంగా దాడి చేసి నలుగురు విటులు, నిర్వాహకులను అరెస్ట్ చేశారు. వీరిని అరెస్ట్ చేశాక విచారణలో సంచలన నిజాలు బయటపడ్డాయి.

In Tirupati Prostitution 01 minఈ వ్యభిచార దందా నిర్వహిస్తోంది ఇద్దరు మహిళలలు కావడం విశేషం. వీరిని కర్ణాటక రాష్ట్రం, బళ్లారికి చెందిన స్వప్న, లక్ష్మి ప్రియగా గుర్తించినట్లు సీఐ శివప్రసాద్ రెడ్డి తెలిపారు. యువతుల ఫొటోలను సాయిచరణ్‌, అనిరుధ్‌ కుమార్‌లు విటులకు పంపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. బెంగుళూరు, గుడివాడ నుంచి యువతులను రప్పించి వీరు ఈ మొత్తం వ్యవహారం నడిపిస్తున్నట్టు తేలింది.

ఇక్కడ ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. కర్ణాటక నుండి ఫ్యామిలీ టైప్ ఆంటీలను సైతం తెప్పించి వారికి రోజు వారీగా వీరు డబ్బులు చెల్లించి వ్యాపారం నిర్వహిస్తున్నారట. ఇక వీరి నుంచి కొంత మంది యువతులను రక్షించినట్లు పోలీసులు పేర్కొన్నారు. డబ్బు కోసం పరాయి రాష్ట్రం నుండి అమ్మాయిలను తీసుకొచ్చి, ఇక్కడ వ్యభిచార కేంద్రాలు నడిపించే ముఠాల సంఖ్య ఈ మధ్య కాలంలో ఎక్కువ కావడం దురదృష్టకరం. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.