భార్య సర్పంచ్.. భర్త చేసిన పాడు పనికి షాకింగ్ నిర్ణయం..!

mahaboobnagar mahilasarpanch telangana

భార్యాభర్తల మధ్య వివాహతేర సంబంధాలే నిండు జీవితాలను ఆగం చేస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే మహబూబ్ నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని జడ్చర్ల మండలం నసురుల్లాబాద్‌ తండా. శ్రీనివాస్‌ నాయక్‌, పాల్‌ త్యావత్‌ సిరి అపూ ఇద్దరు భార్యాభర్తలు. అయితే భార్య గ్రామంలో సర్పంచ్ గా విధులు నిర్వర్తిస్తోంది. కానీ భర్త మాత్రం అదే గ్రామానికి చెందిన మరొక మహిళతో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు. ఈ విషయం తన భార్యకు తెలిసింది.

ఇక ఈ విషయంపై భార్యభర్తల మధ్య తరుచు గొడవలు జరుగుతుండేవి. కొన్నాళ్లకు ఆ మహిళను తీసుకెళ్లి భర్త రెండో పెళ్లి చేసుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత భర్త మహిళను సొంతూరికి తీసుకొచ్చాడు. ఇక విషయం తెలుసుకున్న భార్య భర్తను ఇలా ఎందుకు చేశావని నిలదీసింది. దీంతో భర్త నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. విసిగిపోయిన భార్య పాల్‌ త్యావత్‌ సిరి ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగింది. ఇక గమనించిన స్థానికులు వెంటనే మెరుగైన వైద్యం నిమిత్తం హైదరాబాద్ కు తరలించారు. ఇక చికిత్స పొందిన పాల్‌ త్యావత్‌ సిరి మృతి చెందింది. ఇక భర్త మాత్రం పరారీలో ఉన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు భర్త కోసం గాలింపు చర్యలు చేపట్టారు.