చెన్నైలోని తిరుపత్తూర్ జిల్లా ఆలంగాయం సమీపం నాయకన్నూర్ కొల్లకొట్టాయం ప్రాంతానికి చెందిన యువతి షీభాశ్రీ (17) ఆలంగాయంలోని ఇంటర్ చదువుతోంది. అయితే ఈ మధ్యకాలంలోనే తోటి విద్యార్థులతో కలిసి షీభాశ్రీ ఇంటర్ సెకండీయర్ పరీక్షలు సైతం రాసింది. ఇక పరీక్షలు అయిపోగానే సంతోషంగా ఇంటికి చేరుకుంది. అలా కొన్ని రోజులు గడిచాయి. పరీక్ష ఫలితాల కోసం షీభాశ్రీ ఎదురుచూస్తూ ఉంది. ఆ యువతి పైకి నవ్వుతూ కనిపిస్తున్న లోపల మాత్రం నేను ఎక్కడ ఫెయిల్ అయిపోతానేమోనన్న ఆ ఒక్క భయం వెంటాడుతూనే ఉంది. షీభాశ్రీ భయాన్ని గుర్తించిన కుటుంబ సభ్యులు కాస్త ధైర్యాన్ని నూరిపోశారు.
అయినా షీభాశ్రీకి ఆ భయం వెంటాడుతూనే ఉంది. ఈ క్రమంలోనే ఆ యువతి ఆదివారం స్థానికంగా ఉండే ఓ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. అయితే ఇంట్లో నుంచి వెళ్లిన కూతురు రాత్రి అయినా రాకపోయే సరికి తల్లిదండ్రులు చుట్టుపక్కలా అంతా వెతికారు. అయినా ఎక్కడ కూడా షీభాశ్రీ జాడ కనిపించలేదు. అలా వెతుకున్న క్రమంలోనే ఓ యువతి బావిలో దూకిందన్న వార్త అందింది. దీంతో ఖంగారు పడ్డ షీభాశ్రీ తల్లిదండ్రులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకోగ షీభాశ్రీ విగతజీవిగా పడి ఉంది.
ఇది కూడా చదవండి: Uttar Pradesh: పెళ్లి కార్డు ఇస్తానని యువతి ఇంట్లోకి వెళ్లాడు..మెల్లగా వెంట తెచ్చుకున్న!
కూతురిని అలా చూసిన తల్లిదండ్రులు ఒక్కసారిగా కన్నీరు మున్నీరుగా విలపించారు. ఇక ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. పోలీసుల విచారణలో పరీక్షలో ఫెయిల్ అవుతానేమోనన్న భయంతోనే షీభాశ్రీ ఆత్మహత్యకు పాల్పడ్డట్లు తేలింది. ఇదిలా ఉంటే ఇటీవల విడుదలైన ఇంటర్ పరీక్ష ఫలితాల్లో మాత్రం షీభాశ్రీ మంచి మార్కులతో పాస్ అవ్వడం విశేషం. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానిక కంట కన్నీరు తెప్పిస్తుంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.