లిఫ్ట్ లో బాలుడి అత్యుత్సాహం.. ఎనిమిదేళ్ల బాలికపై మరీ నిచంగా..!

boy misbehaves with girl in lift

ఈ మధ్యకాలంలోని బాలులు సినిమాల నేపథ్యంలో చెడు దారుల్లోకి వెళ్తున్నారు. ఇక రీల్ సీన్ లను రియల్ లైఫ్ లో ప్రయోగాలు చేయాలనే అత్యుత్సాహంతో ఓ బాలుడి చేసిన నీచమైన పనికి అంతా షాక్ గురవుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం.10లో వెంకటగిరి సమీపంలో ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌ లో 14 ఏళ్ల బాలుడు అదే అపార్ట్ మెంట్ లో ఉంటున్న బాలికపై అసభ్యకరంగా ప్రవర్తించాడు.

ఆరో అంతస్తులో ఎవరో పిలుస్తున్నారంటూ పక్కింట్లోని తొమ్మిదేళ్ల బాలికను పిలిచాడు. ఇక నిజమేనేమోనని నమ్మిన ఆ బాలిక అతనితో కలిసి అపార్ట్ మెంట్ లోని లిఫ్ట్ ఎక్కి పైకి వెళ్లారు. ఇక ఆరో అంతస్తు చేరుకునే లోపు ఆ బాలుడు బాలికకు ముద్దు పెట్టాడు. దీంతో పాటు ఆ బాలికను ఎక్కడపడితే అక్కడ తాకుతూ అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఇక అనంతరం ఏడ్చుకుంటూ కిందకు వచ్చిన బాలిక తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి పూర్తి విషయాన్ని పూసగుచ్చినట్లు చెప్పింది.

పరుగు పరుగున వచ్చిన బాలిక తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించారు. ఇక బాలుడి చెప్పిన వివరాలతో మాత్రం పోలీసులు బిత్తరపోయారు. నేను ఎక్కువగా సినిమాలు చూస్తానని, మూవీలోని ముద్దు సీన్ హీరో పెట్టడం నాకు బాగా నచ్చిందని చెప్పాడు. దీంతో అదే సీన్ తో ఆ బాలికకు ముద్దు పెట్టానని తెలిపాడు బాలుడు. ఇక ఐపీసీ సెక్షన్‌ 354, పోక్సో యాక్ట్‌ కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలుడిని జువైనల్‌ హోంకు తరలించారు.