విషాదం: చిన్నారి ప్రాణం తీసిన విక్స్‌ డబ్బా

small baby death

ఇంట్లో ముద్దుముద్దుగా ఆడుకుంటున్న చిన్నారి తెలియక విక్స్‌ డబ్బను నోట్లో వేసుకున్నాడు. దాంతో ఊపిరాడక చనిపోయాడు. హృదయవిదారకమైన ఈ ఘటన నల్లగొండ జిల్లాలో చోటు చేసుకుంది. నార్కట్‌పల్లి మండలం తొండ్రాయి గ్రామంలోని ఓ ఇంట్లో ఆడుకుంటున్న ఏడు నెలల చిన్నారి తను ముందు ఆడుకోడానికి వేసిన విక్స్‌ డబ్బాను మింగేశాడు. గమనించిన కుటుంబసభ్యులు అప్రమత్తమై వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్తుండగా ఊపిరాడక మార్గ మధ్యలోనే చిన్నారి మృతిచెందాడు. దీంతో ఆ చిన్నారి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.