ఆరేళ్ల బాలిక అత్యాచార ఘటనపై స్పందించిన ప్రముఖ క్రికెటర్‌

రాష్ట్ర రాజధానిలో ఆరేళ్ల బాలికపై ఓ కామంధుడు అత్యాచారం జరిపి హత్య చేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కాగా ఈ ఘటనపై భారత క్రికెట్‌ టెస్టు​ జట్టు సభ్యుడు హనుమ విహారి స్పందించారు. నిందితుడి ఆచూకీ కోసం ప్రభుత్వం ప్రకటించిన పది లక్షల రివార్డు, ఇతర వివరాల ప్రకటనను జత చేస్తూ ఆయన ట్వీట్టర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. దాన్ని సాధ్యమైనంత ఎక్కువగా షేర్‌ చేయాలని కోరారు. అలాగే బాలికకు న్యాయం కావాలి అనే హ్యాష్‌ ట్యాగ్‌ను జోడించారు. ఘటన జరిగి నాలుగు రోజులు అవుతున్న నిందితుడ్ని పోలీసులు పట్టుకోలేకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. నిందితుడి వివరాలతో కూడిన ప్రకటన కాపీని సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా షేర్‌ అవుతుంది. వాట్సప్‌ స్టేటస్‌ లలో పోస్టు పెడుతూ సాధారణ ప్రజలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.

Team India Cricketer Hanuma Vihari Respond on 6 year girl rape Case - Suman TV