కొవిడ్ వల్ల పక్షవాతం, గుండెపోటు వచ్చే సూచనలు!!.

కరోనాకు సంబంధించి రోజుకో విషయం వెలుగులోకి వచ్చి మరింత కలవర పెడుతోంది. ఇప్పుడు తాజగా కరోనాతో ఊపిరి తిత్తుల వ్యాధి మాత్రమే కాదు రక్తం కూడా గడ్డ కడుతుందని చెబుతున్నారు. ఆసుపత్రిలో చేరిన కోవిడ్ -19 రోగులలో చేసిన కొన్ని అధ్యయనాల ప్రకారం డీప్ వెయిన్ త్రాంబోసిస్ (డివిటి) అని పిలువబడే రక్తం గడ్డకట్టే ప్రాబల్యం 14-28 శాతం అలాగే ధమనుల త్రంబోసిస్‌కు 2-5 శాతం ఉందని  చెబుతున్నాయి. భారతదేశంలోనూ ఇటువంటి పరిస్థితులను గుర్తించారు. నిపుణులు చెబుతున్న దాని ప్రకారం ఊపిరితిత్తుల ముప్పుతో పాటు రక్తం గడ్డకట్టడం అనే ముప్పుకూడా భారత్ లో ఎక్కువగానే ఉంది. ఈ ఇన్‌ఫెక్షన్‌ కారణంగా ఊపిరితిత్తులకు ఎంత ఇబ్బంది కలుగుతోందో, రక్తనాళాలకూ అంతే హాని జరుగుతోంది కరోనాకు రక్తం గడ్డకట్టడానికి మధ్య దగ్గరి సంబంధం ఉన్నట్టు అధ్యయనాలకు సంబంధించిన విశ్లేషణలను ద లాన్సెట్‌ జనరల్ గతేడాది నవంబర్‌లో ప్రచురించింది.  తాజాగా కరోనా వైరస్ కేవలం ఉపిరి తిత్తులపై‌ను ప్రభావం చూపడం లేదని రక్తనాళాలకు సంబంధించిన వ్యాధిగా కూడా దీనిని పరిగణించాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. కరోనా వైరస్ సోకిన వారిలో 14-28 శాతం రోగుల్లో రక్తం గడ్డకడుతోందని నిపుణులు చెబుతున్నారు. కాళ్లలో రక్తం గడ్డ కడుతోందని అంటూన్నారు.