ప్రముఖ పాపులర్ హాస్య నటి, హిందీ పాపులర్ టెలివిజన్ హోస్ట్ భారతి సింగ్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నటి, కమెడియన్ భారతీ సింగ్ పై కేసు నమోదైంది. అయితే, ఆమె ఈ వ్యాఖ్యలు గతంలో చేసినవి. గడ్డం, మీసాలపై హేళన చేశారంటూ.. సిక్కు సంఘం ఆగ్రహం వ్యక్తం చేశాయి. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 295-ఎ కింద పంజాబ్ లోని అమృత్ సర్ లో భారతీ సింగ్ కు వ్యతిరేకంగా ఎఫ్ఐఆర్ దాఖలైంది. అంతకు ముందు బహిరంగంగా క్షమపణ కోరిన ఫలితం లేకుండా పోయింది. భారతీ సింగ్ వ్యాఖ్యలపై సిక్కు కమ్యూనిటీ ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని SGPC అధికార ప్రతినిధి తెలిపారు. అటువంటి పరిస్థితిలో.. హాస్యనటి భారతీ సింగ్.. సిక్కుల మతపరమైన మనోభావాలను దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అసలు వివాదానికి కారణం ఏంటంటే?
భారతి కామెడీ షోలో టీవీ నటి జాస్మిన్ భాసిన్ అతిథిగా కనిపించింది. జాస్మిన్‌తో భారతి సరదాగా మాట్లాడుతూ.. గడ్డం, మీసాల వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. పాలు తాగుతూ గడ్డం వెంట్రుకలు కొన్నింటిని నోట్లోకి తీసుకుంటే అది సేవియాన్ (సేమియా) కంటే తక్కువ రుచి ఏమీ ఉండదు అని, తన పెళ్లయిన చాలా మంది స్నేహితులు రోజంతా తమ గడ్డం, మీసాల నుంచి పేన్లు తీయడంతో బిజీబిజీగా ఉన్నారని, వారి తమ జీవితాన్ని అలాగానే గడిపేస్తుంటారని చమత్కరించింది. అదే ఇప్పుడు కేసు దాఖలుకు దారితీసింది.
ఇదీ చదవండి: యాంకర్ అనసూయ ఫ్యామిలీ ట్రిప్.. ఫొటోస్ వైరల్!
బహిరంగ క్షమాపణలు :
కమెడియన్ భారతి సింగ్ వ్యాఖ్యలపై సిక్కు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో భారతీ సింగ్ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఏ మత మనోభావాలను గాయపరచాలన్న ఉద్దేశ్యం తనకు లేదంటూ ఒక వీడియో విడుదల చేసింది. గడిచిన మూడు, నాలుగు రోజులుగా ఒక వీడియో వ్యాప్తిలో ఉంది. నేను ఈ వీడియోలో ఏ మతం, కులానికి వ్యతిరేకంగా ఏమీ చెప్పలేదు. ఏ పంజాబీని ఎగతాళి చేయలేదు. నేను నా ఫ్రెండ్ తో సరదాగా కామెడీ చేశాను అంతే. తన వ్యాఖ్యలు ఒకవేళ బాధకు గురి చేసి ఉంటే వారికి రెండు చేతులు ఎత్తి క్షమాపణలు వేడుకుంటున్నాను. తాను కూడా ఓ పంజాబీనేనీ. తాను అమృత్‌సర్‌లో పుట్టాననీ.. పంజాబీని అని గర్విస్తున్నానని చెప్పుకోచ్చారు. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.