జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసిన బీసీసీఐ

BCCI Ganguly Cricket

భారత్‌ క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు జాబ్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఇండియన్‌ సీనియర్‌ మెన్స్‌ టీమ్‌కు హెచ్‌ కోచ్‌, బ్యాటింగ్‌ కోచ్‌, బౌలింగ్‌ కోచ్‌, ఫీల్డింగ్‌ కోచ్‌ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానించింది. ప్రస్తుతం టీమిండియా హెచ్‌ కోచ్‌గా రవిశాస్త్రి పదవీ కాలం టీ20 వరల్డ్‌ కప్‌తో ముగుస్తుంది. అతని స్థానంలో టీమిండియాకు హెచ్‌ కోచ్‌గా ది వాల్‌ రాహుల్‌ ద్రావిడ్‌ రానున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ ఈ నోటిఫికేషన్‌ విడుదల చేయడం విశేషం. కాగా ఈ పోస్టులకు ద్రావిడ్‌, సెహ్వాగ్‌, వీవీఎస్‌ లక్ష్మణ్‌ కూడా అప్లై చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

కాగా టీమిండియా హెడ్‌ కోచ్‌ పదవికి దరఖాస్తు చేసుకునే వారు కనీసం 30 టెస్టులు లేదా 50 వన్డే అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉండాలి. లేదా ఏదైనా జాతీయ జట్టుకు 2 ఏళ్లు కోచ్‌గా పనిచేసిన అనుభవం ఉండాలి. లేదా ఐపీఎల్‌ టీమ్‌కు గానీ, అంతర్జాతీయంగా జరుగుతున్న లీగ్‌లలో, జాతీయ టీమ్‌ ఏకు కనీసం 3 ఏళ్లు కోచ్‌గా పనిచేసిన అనుభవం ఉండాలి. లేదా బీసీసీఐ లెవల్‌ 3 సర్టిఫికేట్‌ ఉన్న కూడా అప్లై చేసుకోవచ్చు. వయసు 60 ఏళ్లకు మించరాదు. ఇతర పోస్టులకు అర్హతలు వేరే విధంగా ఉన్నాయి.