పోసానికి భయంకరమైన చావు వస్తుంది.. బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు

ఫిల్మ్ డెస్క్- తెలుగు సినీ నిర్మాత బండ్ల గణేష్ ‘మా’ ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారు. ‘మా’ జనరల్ సెక్రెటరీ కోసం నామినేషన్ దాఖలు చేసిన బండ్ల గణేష్, మరి ఏమైందో తెలియదు కానీ, చివరి నిమిషంలో పోటీ నుంచి తప్పుకున్నారు. నా దైవ సమానులు.. నా ఆత్మీయులు.. నా శ్రేయోభిలాషుల సూచన మేరకు నేను ‘మా’ జనరల్ సెక్రెటరీ నామినేషన్ ఉపసంహరించుకున్నాను.. అని బండ్ల గణేష్ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు.

‘మా’ ఎన్నిక‌ల్లో ఇద్ద‌రు గొప్ప వ్య‌క్తులు పోరాడుతున్నారని చెప్పిన బండ్ల గణేష్, అలాంటి వారితో పోటీ ప‌డి గెలిచి, హామీలు నేర‌వేర్చ‌లేక‌పోతే త‌ప్పు చేసిన వాడిన‌వుతానని అన్నారు. అందుక‌నే మా ఎన్నిక‌ల నుంచి త‌ప్పుకున్నానని చెప్పారు. ప్ర‌కాశ్ రాజ్‌, మంచు విష్ణుల‌లో ఎవ‌రు గెలిచినా వారు ఇచ్చిన హామీల‌ను నేర‌వేర్చ‌డానికి నా వంతు ప్ర‌య‌త్నం చేస్తానని బండ్ల గణేష్ తెలిపారు. ఇక పవన్ కళ్యాణ్‌ సినమా ఇండ‌స్ట్రీకి ర‌థ‌ సార‌థిలాంటివారని బండ్ల గణేష్ వ్యాఖ్యానించారు.

Bandla Ganesh Posani

ప‌వ‌న్ కళ్యాణ్ కుటుంబ స‌భ్యుల‌పై పోసాని కృష్ణ‌ముర‌ళి చేసిన వ్యాఖ్య‌ల‌పై బండ్ల గ‌ణేశ్ ఘాటుగా స్పందించారు. పోసాని ఎక్స్‌పైరీ అయిన టాబ్లెట్‌తో స‌మానం అని అన్నారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌ల్లి గురించి, ఆయన కుటుంబ స‌భ్యుల గురించి పోసాని అలా మాట్లాడం చాలా త‌ప్పని బండ్ల గణేష్ అభిప్రాయపడ్డారు. దేవుడు అనేవాడు ఉంటే, పోసానికి భ‌యంక‌ర‌మైన చావు వ‌స్తుందని కామెంట్ చేశారు.

అంతే కాదు ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌ల్లి వ‌ల్ల ప‌రోక్షంగా ఎన్నో కుటుంబాలు బ‌తుకుతున్నాయని ఈ సందర్బంగా బండ్ల గణేష్ చెప్పారు. పోసాని కృష్ణమురళి గురించి మాట్లాడి నా స్థాయి తగ్గించుకోలేనని వ్యాఖ్యానించారు. మొత్తానికి నిర్మాత బండ్ల గణేష్ పోసానిపై చేసిన వ్యాఖ్యలు మరోసారి ఇండస్ట్రీలో సంచలనం రేపుతున్నాయి. ఈ ఎపిసోడ్ ‘మా’ ఎన్నికల తరువాత ఐనా ముగుస్తుందా, లేక ఇలా కంటిన్యూ అవుతుందా అన్నదే చర్చనీయాంశమవుతోంది.