కళ్ళకింద నల్లవలయాలు ఇట్టే మాయం

నల్లని వలయాలతో నిస్తేజంగా ఉన్న కళ్లు ముఖ అందాన్ని పోగొట్టడమే కాదు, మనం తీవ్ర ఒత్తిడిలోనో, ఏదైనా ఆరోగ్యసమస్యతోనో ఉన్నామనే విషయాన్ని బహిర్గతం చేస్తాయి. కలువల్లాంటి కళ్లకింద నల్లటి చారికలు ఎందుకు ఏర్పడతాయి? ఆ చారికలపైన సనసన్నని కురుపులు ఎందుకు వస్తాయి? ఎంతో సున్నితంగా ఉండే ఐ స్కిన్ గరుకుగా ఎందుకు తయారవుతుంది? ఈ వలయాలను ఏవిధంగా పోగొట్టుకోవచ్చు?

66988350

వయసు పెరుగుతోంది అని సూచించే మొదటి లక్షణం కనపడగానే, అంటే స్కిన్ డ్రై గా అయిపోవడం వంటిది, కేర్ తీసుకోవడం మొదలు పెట్టాలి, ఇంకా లేట్ చేయకూడదు. విటమిన్ సీ స్కిన్‌కి బలాన్నిస్తుంది. ఇది కొలాజెన్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది, ఫలితంగా స్కిన్ ఇంకా ఎలాస్టిక్ గా ఉంటుంది. విటమిన్ సీ ఎక్కువ గా ఉండే ఫుడ్స్ లో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఇందువల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి ఫ్రీ రాడికల్ ఎక్స్పోజర్ వల్ల ఉండే డ్యామేజ్ బాగా తగ్గుతుంది. ఫలితం, చక్కని మెరిసే చర్మం.

dark circles 2

విటమిన్ సీని టాపికల్ గా అప్లై చేయవచ్చు కానీ అది కొద్దిగా ప్రమాదకరం. విటమిన్ సీ 10% కాన్సంట్రేషన్ లో ఉండాలి. ఇది స్కిన్ ని డ్రై గా మారుస్తుంది, కాబట్టి దీన్ని హయలురానిక్ యాసిడ్ లేదా ట్రై పెప్టైడ్ కాంప్లెక్స్‌తో కలపాలి.స్కిన్ కేర్ రొటీన్‌లో భాగం గా చాలా మంది కళ్ళ మీద కీరా స్లైసులు పెట్టుకోవడం మనం చూస్తూనే ఉంటాం. కళ్ళ కింద నల్లని వలయాలని ట్రీట్ చేయడంలో కీరాని మించింది లేదు. ఇందుకు మనం చేయవలసిందల్లా కీరాని స్లైసులుగా కట్ చేసి ఫ్రిజ్‌లో ముప్ఫై నిమిషాల పాటూ ఉంచడం.టొమేటోస్‌లో ఉండే లైకోపిన్ డార్క్ సర్కిల్స్ రాకుండా కాపాడుతుంది. బెస్ట్ రిజల్ట్స్ కోసం టొమేటో జ్యూస్‌ని, నిమ్మరసాన్ని సమాన భాగాలుగా కలిపి ఒక కాటన్ బాల్‌తో కళ్ళ కింద అప్లై చేయండి. పది నిమిషాల తరువాత గోరువెచ్చనినీటితో కడిగేయండి.బంగాళా దుంపలో ఉండే విటమిన్ సీ స్కిన్ కి మంచి గ్లో తీసుకు వస్తుంది. ఇందు కోసం బంగాళాదుంపల్ని తురిమి జ్యూస్ తీయండి. కాటన్ ప్యాడ్స్‌ని ఈ జ్యూస్ లో ముంచి వాటిని డార్క్ సర్కిల్స్ మీద పది నిమిషాలు ఉంచండి. ఆ తరువాత గోరు వెచ్చని నీటితో కడిగేయండి. ప్రశాంతమైన నిద్ర కూడా ఎంతో అవసరం. ఒత్తిడి తగ్గించుకోవడానికి యోగా లేదా మెడిటేషన్ హెల్ప్ చేస్తాయి.