కాలుకి 9 వేళ్ళు! బ్రహ్మం గారు చెప్పినట్టే పుట్టిన బాబు!

మీరు అందరు బ్రహ్మం గారి కాలజ్ఞానం వినే ఉంటారు. కాలజ్ఞానంలో ఆయన చెప్పిన విషయాలు చెప్పినట్టే జరుగుతున్నాయి. అయితే.., ఈ మధ్య కాలంలో ఎక్కడ, ఎలాంటి చిత్రమైన సంఘటన జరిగినా.., దాన్ని బ్రహ్మం గారి కాలజ్ఞానంకి ఆపాదించేయడం పరిపాటి అయిపోయింది. ఇందుకు కారణం లేకపోలేదు. బ్రహ్మం గారు చెప్పిన అసలైన కాలజ్ఞానంకి మరిన్ని విషయాలు జోడించి దానిని కూడా మార్కెటింగ్ చేసుకుని డబ్బులు సంపాదించే వాళ్ళు ఎక్కువ అయ్యారు. ఈ కారణంగానే వీరభోగ వసంతరాయులు చెప్పిన నిజమైన కాలజ్ఞానంలో ఏవే అంశాలు ఉన్నాయో ఈనాటికీ చాలా మందికి తెలియకుండా పోయింది. అయితే.., ఇప్పుడు మాత్రం బ్రహ్మం గారు కాలజ్ఞానంలో చెప్పినట్టుగానే కర్నాటకలోని హోసాపేట్లో ఓ అద్భుతం చేసుకుంది. మరి ఆ అద్భుతం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. కర్నాటకలోని హోసాపేట్ కి చెందిన ఓ మహిళ డెలివరీ కోసం హాసిపిటల్ లో జాయిన్ అయ్యింది. కానీ.., ఆమెకి సాధారణ కాన్పు కి ఛాన్స్ లేకపోవడంతో డాక్టర్స్ సిజేరియన్ చేసి బిడ్డని బయటకి తీశారు. పుట్టింది పండింటి మగబిడ్డ అని తెలియడంతో అంతా సంబరపడిపోయారు. కానీ.., ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే.. ఆ బాబు కాలికి 9 వేళ్ళు ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

vellu 2సాధారణంగా ప్రతి ఒక్కరికీ కాలికి ఐదు వేళ్లు మాత్రమే ఉంటాయి. కొంత మందికి మాత్రం ఆరు వేళ్లు కూడా ఉంటాయి. ఇంతకంటే ఎక్కువ ఉండటం దాదాపు అసాధ్యం. కానీ.., ఒకే కాలికి తొమ్మిది వేళ్లు ఉండటం డాక్టర్స్ ని సైతం నిర్ఘాంత పోయేలా చేసింది. స్థానిక ఆస్పత్రిలోనే ఈ మహిళకు డాక్టర్ బాలచంద్రన్ డెలివరీ చేశారు. ఆయన ఈ ఘటనపై స్పందించారు. పుట్టిన అబ్బాయి ఎడమ కాలికి ఏకంగా తొమ్మిది వేళ్లు ఉన్నాయి. ఇలాంటి కేసులు చాలా అరుదు. కానీ.., అదృష్టం ఏమిటంటే బాబుకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు. తల్లీ, బిడ్డలు ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. ఈ ఘటన మెడికల్ హిస్టరీలోనే చాలా అరుదని డాక్టర్ స్పష్టం చేశారు. ఇక మహిళ కుటుంబ సభ్యులు ఇది దేవుడి వరం అని సంబరపడ్డారు. తల్లీ, బిడ్డలను క్షేమంగా చూసినందుకు డాక్టర్లకు ధన్యవాదాలు తెలిపారు. ఇక మీరు కాలజ్ఞానాన్ని గమనించినట్టైతే దేశానికి దక్షిణాన కాలికి 9 వేళ్ళతో శిశువు జన్మించేను అని బ్రహ్మం గారు కాలజ్ఞానంలో స్పష్టంగా చెప్పి ఉన్నారు. దీంతో.., ఇది ఆయన మహిమే అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.