తరుచూ వేడి నీళ్లు తాగి, ఆవిరి పడుతున్నారా.. ఐతే జాగ్రత్త

staem

హెల్త్ డెస్క్- కరోనా నేపధ్యంలో చాల మంది ఇప్పుడు ఇటి చిట్కాలు ఫాలో అవుతున్నారు. కరోనా లక్షణాలు లేకపోయినా.. ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగాంగా చాలా మంది ప్రతి రోడు వేడి నీళ్లు తాగడం, ఆవిరి పట్టడం చేస్తున్నారు. ఇది కొంత వరకు మేలు చేసినా.. మరీ ఎక్కువగా వేడి నీళ్లు తాగినా, ఆవిరి పట్టినా అనర్ధాలు తప్పవని అంటున్నారు వైద్య నిపుణులు. ముక్కు దిబ్బడగా ఉండి, ముక్కు ద్వార శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉన్నప్పుడు, నోటి ద్వారా శ్వాస తీసుకునే పరిస్థితి ఉంటే రెండు, మూడు రోజుల పాటు ఉదయం, సాయంత్రం ఆవిరి పట్టొచ్చని వైద్యులు చెబుతున్నారు. ఐతే నెలల తరబడి ఇలా ఆవిరి పట్టకూదని అంటున్నారు. అలా చేస్తే అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

వేడి నీరు తాగడంపై కూడా చాలా అపోహలున్నాయి. నెలల తరబడి వేడి నీళ్లు తాగితే అల్సర్లు ఏర్పడే అవకాశం ఉందని వైద్యులు అంటున్నారు. కంటిన్యూగా వేడి నీరు తాగడం వల్ల ఆయాసం, కడుపులో మంట వంటి సమస్యలు తలెత్తుతాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఎక్కువ రోజులు తరుచూ వేడి నీరు తాగితే అన్నవాహిక దెబ్బతిని క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు లేకపోలేదని వైద్యులు చెబుతున్నారు. అనవసరంగా ప్రతి దానికి వేడి నీళ్లు తాగడం, ఆవిరి పట్టడం చేయకూడదని అంటున్నారు. సో.. ఇకపై ఎప్పుడు పడితే అప్పుడు ఆవిరి పట్టడం, వేడి నీళ్లు తాగడం చేయకండి మరి. ఏదైనా అనారోగ్య సమస్య ఉంటే వైద్యులను సంప్రదించి సలహాలు తీసుకోవాలి.