జగన్ మరో సంచలన నిర్ణయం! ఏపీ శాసనమండలి కొనసాగింపు!

మూడు రాజధానుల బిల్లు రద్దు చేసుకుంటున్నట్లు సంచలన నిర్ణయం ఏపీ ప్రభుత్వం తీసుకుంది. అది మరువక ముందే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. తమ బిల్లులకు అడ్డు తగులుతుందని శాసన మండలికి రద్దు చేయాలి గతం అసెంబ్లీలో తీర్మానించారో అదే శాసనమండలి రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. శాసన మండలి రద్దు నిర్ణయం వెనక్కి తీసుకునే తీర్మానాన్ని ఏపీ అసెంబ్లీ ఆమోదించింది. ఇప్పుడు మండలిలో వైసీపీ బలంగా పెరిగింది కాబట్టి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.

burgan minగతంలో ఏదో రకంగా అసెంబ్లీ నిర్ణయాలను మండలిలో అడ్డుకోవాలని ఇన్నాళ్లు చూశారని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇప్పుడా మండలిలో ఆ పరిస్థితి లేదని, అందుకే కౌన్సిల్ను కొనసాగించాలని నిర్ణయించినట్లు చెప్పారు. జనవరి 27,2020న శాసనమండలిని రద్దు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సర్కార్ అసెంబ్లీలో తీర్మానాన్ని చేసింది. ఈ బిల్లును పార్లమెంట్ కు పంపడంతో గత కొంతకాలంగా కౌన్సిల్పై సందిగ్ధత కొనసాగింది. దీంతో ఇవాళ మండలి రద్దు నిర్ణయం వెనక్కి తీసుకుంటూ అసెంబ్లీ అమోదం తెలిపింది. శాసనమండలి రద్దు నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటూ ఏపీ అసెంబ్లీ తీర్మానం చేసింది.

gsdaga min

ఈ సందర్భంగా శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి మాట్లాడుతూ.. రాజ్యాంగంలోని 168 అధికరణ కింద 1958లో శాసన మండలిని ఏర్పాటు చేశారన్నారు. తెదేపా హయాంలో శాసన మండలిని రద్దు చేశారని ఆయన గుర్తు చేశారు. తిరిగి 2006లో శాసన మండలిని మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి పునరుద్ధరించారని ఆయన తెలిపారు. ప్రజాప్రతినిధుల నుంచి ఎన్నుకోబడిన మండలి సుప్రీం అయినప్పటికీ దిగువ సభకు సూచనలు మాత్రమే చేయాల్సి ఉందన్నారు.

gag min 3
ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు శాసన మండలిని రద్దు చేయగా.. మరికొన్ని రాష్ట్రాల్లో అసలు ఏర్పాటే చేయలేదని మంత్రి బుగ్గన గుర్తు చేశారు. కొన్ని కీలక అంశాల్లో సందిగ్ధతకు కారణమవుతున్నందున రద్దు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.కొత్త సభ్యుల రాకతో శాసనమండలి ఇకపై అసెంబ్లీ నిర్ణయాలకు అనుగుణంగా ఉంటుందనే భావనతో గతంలో రద్దు చేస్తూ చేసిన తీర్మానాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు మంత్రి బుగ్గన సభకు తెలిపారు.