ఏపీలో కర్ఫ్యూ అమల్లోకి!..

ఏపీలో కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది. బుధవారం నుంచి మధ్యాహ్నం 12 తర్వాత కఠినమైన ఆంక్షలు అమలుకానున్నాయి. ఆర్టీసీ బస్సులకు సంబంధించి కూడా ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే ప్రజా రవాణా వాహనాలు నడపాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో బస్సులు, ఆటోలు, క్యాబ్‌లు వంటివి మధ్యాహ్నం తర్వాత నడిపేందుకు అవకాశం ఉండదు. బస్సులు తిరిగేందుకు ఆరుగంటలే సమయం. 

ఇప్పటికే బెంగళూరు, చెన్నైకు బస్సులు నిలిపివేయగా.. తాజాగా హైదరాబాద్‌కు సర్వీసులు ఆపేశారు. దూర ప్రాంత సర్వీసులు దాదాపు నిలిపేస్తామని అధికారులు తెలిపారు. ఇప్పటికే 50% సీట్ల సామర్థ్యంతో నడుపుతుండగా.. బుధవారం నుంచి కనీసం 85 శాతం సీట్లలో ప్రయాణికులు నిండితేనే బస్సులు బయలుదేరనున్నాయి. ఓ ప్రాంతానికి వెళ్లే రెండు, మూడు సర్వీసులను కలిపి ఒకే సర్వీసుగా పంపనున్నారు. 

రెండు వారాలపాటు ఏపీ బార్డర్లో ఈ ఆంక్షలే అమలులో ఉంటాయని.. వాహనదారులు గమనించాలని కోరారు. అలాగే నిత్యావసరాలు, ఇతర సరుకులు రవాణా చేసే వాహనాలకు మాత్రం అనుమతి ఉంది.. వారికి కర్ఫ్యూ ఆంక్షలు వర్తించవని అధికారులు తెలిపారు. అయితే లోడింగ్, అన్ లోడింగ్ ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల్లోపే చేయాల్సి ఉంటుంది. వైద్య ఆరోగ్యానికి సంబంధించిన మందులు, ఇతర వస్తువులు ఎప్పుడైనా చేసుకోవచ్చు.