Gummitham Tanda: గ్రీన్‌కో ఎనర్జీస్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభవార్త ప్రకటించింది. ప్రపంచలోనే మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ రెనివబుల్ ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్ట్‌ను ఏపీలోని కర్నూలు జిల్లాలో నిర్మించనుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆ ప్రాజెక్టుకు మంగళవారం శంకుస్థాపన చేయనున్నారు. గ్రీన్‌కో 5410 మెగావాట్ల ఈ హైబ్రిడ్ మెగా ప్రాజెక్టును కర్నూలులోని గుమ్మటం తాండలో ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం 15 వేల కోట్ల రూపాయలు వెచ్చించనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా సోలార్, విండ్, హైడల్ విద్యుత్‌ను ఉత్పత్తి చేయనున్నారు. ఇలా ఒకే ప్లాంట్ నుంచి మూడు రకాల విద్యుత్ ఉత్పత్తి అయ్యే ప్రాజెక్టు ప్రపంచంలోనే మొట్టమొదటిది కావటం విశేషం.
ఇప్పటికే శంకుస్థాపనకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. సీఎం రాక నేపథ్యంలో గుమ్మటం తాండాలో అధికారులు భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు 800 మంది పోలీసులు రంగంలోకి దిగనున్నారు. ఇద్దరు అడిషనల్ ఎస్పీలు, ఏడుగురు డీఎస్పీలు, 19 మంది సీఐలు, 43 మంది ఎస్‌ఐలు, 122 మంది ఏఎస్‌ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, 283 మంది కానిస్టేబుళ్లు, 28 మంది మహిళా పోలీసులు, 169 మంది హోంగార్డులు, 03 ప్లటూన్ల ఏఆర్ సిబ్బంది, 02 ప్లటూన్ల ఏపీఎస్‌పీ సిబ్బంది, 7 స్పెషల్ పార్టీ బృందాలను బందోబస్తు విధులకు కేటాయించారు. మరి, ఈ ప్రాజెక్టుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Great News For Andhra Pradesh !
Greenko To Establish 5410 MW Hybrid Power Project ( Solar + Wind ) With Rs. 15000 Crores Investment at Gummitham Tanda in Kurnool
Tomorrow CM @ysjagan will lay foundation stone for world’s first integrated renewable energy storage project pic.twitter.com/mJNI32EXPH
— Vizag – The City Of Destiny (@Justice_4Vizag) May 16, 2022
ఇవి కూడా చదవండి : CM Jagan: రైతు భరోసాకి సీఎం జగన్ శ్రీకారం.. రైతుల ఖాతాల్లో లక్ష కోట్లు!