ఏపీ అసెంబ్లీ ఘటనతో రాజీనామా చేసిన ఈ కానిస్టేబుల్ నేపధ్యం ఏమిటంటే?

Constable Chendrababu Naidu Ap

శుక్రవారం ఏపీ అసెంబ్లీలో జరిగిన ఘటన ఏపీ రాజకీయాల్లో కాస్త హీట్ ను పుట్టిస్తుంది. ఇదే అంశంపై నేతలు ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ లో వెక్కి వెక్కి ఏడవడం ఏపీ రాజకీయాలను పూర్తిగా మార్చేసింది. తమ కుటుంబంలోని ఆడవాళ్లపై వైసీపీ నేతలు ఇష్టమొచ్చినట్లు కామెంట్స్ చేస్తున్నారని చంద్రబాబు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఈ ఘటనపై రాజకీయాలకు అతితంగా కొందరు మద్దతు పలుకుతుంటే మరికొంత మంది వ్యతిరేకిస్తున్నారు.

అయితే తాజాగా ఇదే ఘటనపై ప్రకాషం జిల్లాలోని ఓ కానిస్టేబుల్ ఓ వీడియోను విడుదల చేస్తూ తన ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నానంటూ భావోద్వేగంతో కూడిన ప్రకటన చేశాడు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తనకు ఉద్యోగం వచ్చిందని ఈరోజు వరకు విలువలతో చేయి చాచకుండా నిజాయితీగా బ్రతికానంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఇదే కాకుండా వైసీపీ చేసే దిగజారుడు రాజకీయాలు మంచివి కావంటూ కన్నీటిపర్యంతమయ్యారు.

Constable Chendrababu Naidu Ap

అయితే దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అసలు ఎవరీ కానిస్టేబుల్ అంటూ అంతా వెతికే పనిలో పడ్డారు. ఈ కానిస్టేబుల్ పూర్తి పేరు విజయ్ కృష్ణ. 1998 బ్యాచ్ లో సివిల్ కానిస్టేబుల్ గా ఉద్యోగం లభించింది. అప్పట్లో నిర్వహించిని రిటర్న్ టెస్ట్ లో టాపర్ గా నిలిచాడు. ఇక ఆ తర్వాత 2002, 2003లో ఒంగోలు పీటీసీలో బెస్ట్ షూటర్‌గా రెండుసార్లు నిలిచారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విజయ్ కృష్ణ కి ఉద్యోగం లభించటం విశేషం.

కాగా విజయ్ కృష్ణ అమితంగా అభిమానించే నాయకుల్లో చంద్రబాబు నాయుడు ఒకరని తెలుస్తోంది. అయితే తాజాగా ఏపీ అసెంబ్లీ ఘటన, చంద్రబాబు భావోద్వేగ ఈ రెండు ఘటనలపై తీవ్ర ఆవేదానికి గురయ్యాడు. దీంతో వెంటనే తన అభిమాన నాయకుడు ఒక్కసారిగా కన్నీటిపర్యంతమవ్వడంతో విజయ్ కృష్ణ తట్టుకోలేకపోయాడు. ఈ నేపథ్యంలో తన పోలీస్ ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు కానిస్టేబుల్ విజయ్ కృష్ణ తెలిపాడు. ఇక చంద్రబాబు ఘటనపై కానిస్టేబుల్ విజయ్ కృష్ణ తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.