నెల్లూరు జిల్లాలో అరుదైన నక్షత్ర తాబేళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తడ మండలం బీవీపాలెం వద్ద ఉమ్మడి తనిఖీ కేంద్రం వద్ద స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో సీఐ ఆర్‌యూవీఎస్ ప్రసాద్ చేపట్టిన వాహనాల తనిఖీలలో భాగంగా 134 నక్షత్ర తాబేళ్లు పట్టబడ్డాయి. తమిళనాడు పురుషవాకంకు చెందిన రవికుమార్ వ్యక్తి నెల్లూరు నుండి చెన్నై కు అక్రమంగా తమిళనాడు ఆర్టీసీ బస్సులో తరలిస్తున్న అరుదైన నక్షత్ర తాబేలుతో పాటు నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు.
నెల్లూరు జిల్లా నుంచి చెన్నైకు తరలించి.. అక్కడి నుంచి మలేషియాకు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ అరుదైన నక్షత్ర తాబేళ్లకు మలేషియాలో మంచి డిమాండ్ ఉన్నట్లు సమాచారం. చెన్నై నుంచి మలేషియాకు తరలించి ఎనిమిది నుంచి పది లక్షల రూపాయలు మధ్య అమ్మకాలు సాగిస్తున్నట్లు చెప్పారు. అక్రమంగా తరలిస్తున్న నక్షత్ర తాబేళ్లను నెల్లూరు జిల్లా ఎస్పీ విజయ రామారావు ఆధ్వర్యంలో జిల్లా అటవీ శాఖ అధికారులకు అందించి వాటిని సంరక్షణ కల్పించాలని సూచించారు.
ఇది చదవండి : సైనాకు హీరో సిద్దార్థ్ బహిరంగ క్షమాపణ!