వివేకా హత్య కేసులో వెలుగులోకి మరిన్ని సంచలన నిజాలు

Ys Vivekananda reddy Murder Ap

వివేకా హత్య కేసులో తాజాగా మరిన్ని సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే విచారణలో దూకుడు మీదున్న సీబీఐ రోజుకొక ట్విస్టులను తెరమీదకు తీసుకొస్తూ హీట్ ను పెంచుతుంది. ఈ క్రమంలోనే వివేకా హత్యకేసులో దస్తగిరి, ఎర్ర గంగిరెడ్డి, సునీల్‌ యాదవ్‌, ఉమాశంకర్‌ రెడ్డి,వాచ్‌మ్యాన్‌ రంగయ్య సహా ఎందర్నో సీబీఐ ఇప్పటికే విచారించి తగిన సమాచారాన్ని రాబట్టుకోగలిగింది. వీరి విచారణ అనంతరం ఎంపీ అవినాష్‌ రెడ్డి పాత్రపై కూడా ఓ రకమైన అనుమానాలకు తావిస్తున్నట్లు కూడా కథనాలు వెలువడుతున్నాయి.

అయితే ఇటీవల కాలంలో ఈ హత్య కేసులో అయిన వాళ్లే ఆస్తి కోసం ఇంతటి దారుణానికి పాల్పడ్డారని ఓ రకంగా ఆరోపణలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ కేసులో తాజాగా సొంత అల్లుడి పాత్రపైనే అనుమానలున్నట్లు భరత్‌ యాదవ్‌ అనే వ్యక్తి ఆరోపణలు చేయటం సంచలనంగా మారింది. ఇటీవల భరత్ యాదవ్ పేరు తెరమీదకు రావటంతో అదిరిపోయి మొత్తానికి సొంత అల్లుడైన సునీత రాజశేఖర్ రెడ్డే మొదటి సూత్రదారుడంటూ బాంబ్ పేల్చాడు. ఇంత కాలం ప్రాణభయంతోనే ఆయన పేరును బయటపెట్టలేకపోయానని భరత్ యాదవ్ చెప్పినట్లు తెలుస్తోంది.

ఇక రోజుకొక మలుపు తిరుగుతున్న ఈ కేసులో సొంత అల్లుడు పేరు బయటకు రావడంతో సీబీఐ ఎలా మందుకు వెళ్లబోతుందోనని కాస్త ఆసక్తికరంగా మారింది. మరీ నిజంగానే వివేకా హత్యకేసులో అల్లుడైన సునీతరాజశేఖర్ రెడ్డి పాత్ర ఉందా అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఇక రానున్న సీబీఐ ఈ కేసులో ఎలా ముందుకు వెళ్లబోతుందో చూడాలి. వివేకా హత్య కేసులో కొత్తగా సొంత అల్లుడు రాజశేఖర్ రెడ్డి పేరు ఉందని మీరు ఏకీభవిస్తున్నారా? అయితే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.