ప్రభుత్వ ఉద్యోగం కావాలని దాదాపుగా ప్రతీ ఒక్కరు కోరుకుంటారు. కొందరు కష్టపడి చదవి ఉద్యోగాన్ని సాధించుకుంటారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం పెద్ద సీదికి చెందిన అల్లక కేదారీశ్వర రావు అనే వ్యక్తి 1965లో జన్మించాడు. పదో తరగతి వరకు సొంత గ్రామంలోనే చదువుకున్నాడు. ఈయన 1994లో డీఎస్సీని తృటిలో కోల్పోయారు.. 1996లో సెలెక్ట్ అయినా కొన్నికారణాల వల్ల అవకాశం రాలేదు. ఆ తర్వాత కష్టపడి చదివి 1998లో డీఎస్సీకి క్వాలిఫై అయ్యారు. ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందన్న ఆనందం ఎంతోసేపు నిలవలేదు. ఎప్పుడో 1998లో డీఎస్సీ పరీక్షరాస్తే.. ఇప్పుడు అతడికి ఉద్యోగం వచ్చింది. అయితే ఉద్యోగం వచ్చిందని ఆనంద పడాలా లేక వ్యవస్థలో లోపం వలన జీవితాన్ని కోల్పోయాడని బాధపడాలో తెలియదు గాని చివరికి మాత్రం సక్సెస్ అయ్యాడు. తాజాగా సుమన్ టీవి యాంకర్ తో అల్లక కేదారీశ్వర రావు మాట్లాడుతూ.. తన జీవితంలో పడ్డ కష్టాల గురించి ఎమోషన్ అయ్యారు.
‘‘శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం పెద్ద సీదిలో 1965లో తాను జన్మించానని.. ప్రస్తుతం తన వయసు 57 సంవత్సరాలు అని తెలిపారు అల్లక కేదారీశ్వర రావు. 1998లో డీఎస్సీకి క్వాలిఫై అయినప్పటికీ.. కొన్ని కారణాల వల్ల తనకు మెరిట్ రాలేదని అన్నారు. దీంతో 2000 వేల సంవత్సరంలో హైదరాబాద్ కి వెళ్లిపోయానని.. అక్కడ కొన్ని కంపెనీల్లో పనిచేశానని అన్నారు. మా నాన్న చనిపోయిన తర్వాత కుటుంబ బాధ్యతలు మోయాల్సి వచ్చిందని.. తనకు ముగ్గురు అక్కచెల్లెళ్లు ఉన్నారని అన్నారు. తాను చేనేత కుటుంబానికి చెందిన వాడినని.. విజయనగరం నుంచి బట్టలు తెచ్చి అమ్ముకునేవాళ్లమని అన్నారు. తాను బట్టలు అమ్ముకుంటూ బీఈడీ చదివానని.. 1992 లో ఫస్ట్ అటెమ్ట్ లోనే పాస్ అయ్యానని అన్నారు. తాను ఎంతో కష్టపడి చదివానని.. జాబ్ వస్తుందని ఎన్నో ఆశలు ఉండేవని అల్లక కేదారీశ్వర రావు అన్నారు. మా అమ్మపేరు అమ్మాయమ్మ.. నేను హైదరాబాద్ వెళ్లి వచ్చిన తర్వాత ఆమె కనిపించకుండా పోయిందని.. ఇప్పటికీ ఆమె జాడ తెలియదని ఆవేదన వ్యక్తం చేశాడు. అప్పట్లో బిజినెస్ చేసి పూర్తిగా లాస్ అయ్యానని.. బుక్స్ కొనేందుకు కూడా డబ్బులు లేకుండా పోయాయని అన్నారు. నిరాశలో పెళ్లి కూడా చేసుకోలేదని.. తీవ్ర మనోవేదనకు గురై ఏదో చిన్న చిన్న పని చేసుకుంటూ జీవనం సాగిస్తూ వచ్చానని… ఇలా 24 ఏళ్ళు గడిచిపోయాయని అన్నారు.’’ మరిన్ని వివరాల కోసం ఈ క్రింది వీడియోపై క్లిక్ చేయండి.