పందెం కోళ్లు ఎన్ని రకాలు ఉంటాయో తెలుసా?

తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద పండగ అంటే సంక్రాంతి పండగనే చెప్పాలి. ఈ పండగ వచ్చిందంటే చాలు కొత్త అల్లుళ్లు, కోడి పందాలతో కోస్తాంద్ర ప్రాంతాలన్నీ కోలాహాలంగా మారిపోతాయి. ఈ ప్రాంతాలే కాకుండా తెలంగాణలో కూడా అనేక ప్రాంతాల్లో రాయుళ్లు కోడిపందాలు నిర్వహిస్తారు. ఆనాదిగా కాలం నుంచి కోడిపందాలు సంప్రదాయంగా వస్తూ ఉండడంతో కోడి పందాలలో పాల్గొనేందుకు చాలా మంది ఉత్సాహం చూపిస్తూ ఉంటారు. ఈ కోడి పందాల కోసం కొంత మంది లక్షల్లో డబ్బును ఖర్చు చేస్తూ ఉంటారు. అలా పెంచిన కోళ్లను పందాల్లోకి దింపి దింపి గెలుపు ఒటములను పరువు-ప్రతిష్టగా భావిస్తారు. అయితే ఈ పందాలలో పాల్గొనే కోళ్ల రకాలు ఎన్ని అనేవి మనం ఇప్పుడు తెలుసుందాం.

పందెం కోళ్ల రకాలు:

  • డేగ: ఈ కోడికి ఎర్రటి ఈకలు ఉంటాయి.
  • కాకి: ఈ కోడి పుంజుకు నల్లటి ఈకలు ఉంటాయి.
  • పచ్చకాకి: ఈ కోడి పుంజుకు ఆకుపచ్చ, నలుపు ఈకలు ఉంటాయి.
  • సవల: ఈ కోడి మెడపై నల్లటి ఈకలు ఉంటాయి.
  • నెమలి: ఈ కోడి పుంజు పసుపు ఈకలు ఉంటాయి.
  • కౌజు: ఈ కోడి పుంజుకు నలుపు, ఎరుపు, పసుపు ఈకలు ఉంటాయి.
  • పింగళి: ఈ కోడి పుంజుపై తెలుపు రెక్కలపై నలుపు, గోదుమ రంగు ఈకలు ఉంటాయి.

ఇక ఇవే కాకుండా ఇంకా చాలా రకాల పందెం కోళ్లు ఉంటాయని తెలుస్తోంది