మంచి మనసు చాటుకున్న సీఎం జగన్! అంబులెన్స్ కి దారి..

cm jagan ap

108 ఈ మాట వినగానే ప్రతి తెలుగువాడికి దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గుర్తుకి రాక మానరు. గాయపడ్డ వ్యక్తికి తక్షణం సహాయం అందితే అతని ప్రాణాలను కాపాడవచ్చని అప్పట్లో వైఎస్సార్ ఈ పధకాన్ని ప్రవేశ పెట్టారు. ఈ ఆలోచన అద్భుత ఫలితాన్ని ఇవ్వడంతో తరువాత వచ్చిన ప్రభుత్వాలు కూడా ఈ పధకాన్ని కంటిన్యూ చేస్తూ వచ్చాయి. ఇక గతంలో వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి తన మీటింగ్స్ లో ఎన్నో సార్లు అంబులెన్స్ కి దారి వదలమని తమ అభిమానులను కోరిన ఘటనలు ఉన్నాయి. ఇక ఇప్పుడు తాజాగా ఇలాంటి ఘటనే జరిగింది.

సీఎం జగన్ ఈరోజు శంషాబాద్ లో ఓ వివాహానికి హాజరయ్యాడు. తరువాత వెంటనే ఏపీకి వెళ్లిపోయారు. అయితే.. గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి తాడేపల్లి వెళుతుండగా ఓ ఘటన జరిగింది. తన కాన్వాయి వెనుక 108 అంబులెన్స్ ను జగన్ గమనించారు. ఆంబులెన్స్ ని చూడగానే స్పందించిన సీఎం జగన్ తన కాన్వాయ్‌ని ఆపించి, అంబులెన్స్‌ ముందుకి వెళ్లేందుకు దారి ఇచ్చారు.ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పటికి అంబులెన్స్ ప్రాముఖ్యత తెలిసిన వ్యక్తిగా జగన్ వ్యవహరించిన తీరుపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.