ఏపీలో షర్మిల పార్టీ ఏర్పాటుపై అనిల్ కుమార్ ఏమన్నారంటే?

Sharmila

స్వర్గీయ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల తెలంగాణలో వైఎస్సార్‌టీపీ స్థాపించిన అధికార ప్రభుత్వంపై విమర్శనస్త్రాలు సందిస్తుంది. అయితే గత కొన్ని రోజుల నుంచి ఏపీలో కూడా షర్మిల పెట్టబోతుందన్న వార్తలు కూడా వినిపించాయి. ఇటీవల పార్టీ మీటింగ్ లో పాల్గొన్న షర్మిల పార్టీ పెడతామని స్పష్టతనివ్వకుండా ఎక్కడైన, ఎవ్వరైన పార్టీ పెట్టుకునే హక్కు ఉందంటూ షర్మిల తెలిపింది.

అయితే తాజాగా వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల భర్త అనిల్ కుమార్ ఏపీలో షర్మిల పార్టీ ఏర్పాటుపై స్పందించారు. విజయవాడ వచ్చిన ఆయనను ఎయిర్ పోర్టులో విలేకర్టు షర్మిల ఏపీలో పార్టీ నిజంగానే పెడుతున్నారా అని అడగగా.. నాకు రాజకీయలతో సంబంధం లేదని, నేను పెళ్లి ఉంటే విజయవాడకు వచ్చానని అనిల్ కుమార్ తెలిపారు.