జగన్ మరో సహాయం! ఆ పిల్లలకి రూ.10 లక్షలు!

తెలుగు రాష్ట్రాలలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో మరణాల సంఖ్య ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోన్న విషయం. కానీ.., ఏపీ ప్రభుత్వం ఇప్పటికీ అక్కడ టెస్ట్ లు కొనసాగిస్తూనే ఉంది. క్వారెంటైన్ సెంటర్స్ అలానే రన్ చేస్తోంది. క్వారెంటైన్స్ సెంటర్స్ కి వచ్చి కోలుకుంటున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండటం కాస్త మంచి పరిణామం. కానీ.., వైద్య సదుపాయాలు, బెడ్స్, ఆక్సిజన్ కొరత వంటి సమస్యలు ఏపీలోనూ ఉన్నాయి. దీనితో.. అక్కడక్కడా మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి.

ఈ నేపథ్యంలో జగన్ ఒకవైపు రాష్ట్రంలో వైద్య సదుపాయాలను మెరుగుపరిచే కార్యక్రమాలు చేస్తూనే.., మరోవైపు కష్టాల్లో ఉన్న ప్రజలను నేరుగా ఆదుకునే కార్యక్రమాలు మొదలు పెట్టారు. ఇందులో భాగంగానే కోవిడ్ తో చనిపోయిన వారి అంత్యక్రియలకు ఏపీ ప్రభుత్వం రూ.15 వేల తక్షణ సహాయాన్ని ప్రకటించిన వియషం తెలిసిందే. ఇప్పుడు దానికి కొనసాగింపుగా మరో నిర్ణయాన్ని తీసుకున్నారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. రాష్ట్రంలో కరోనా కారణంగా తల్లిదండ్రులు ఇద్దరినీ కోల్పోయిన పిల్లలు ఎవరైనా ఉంటే.. వారి పేరు మీద రూ.10 లక్షల ఫిక్సిడ్ డిపాజిట్ చేయాలని జగన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశాడు. దీనికి అవసరమైన కార్యాచరణ ప్రణాళికలను సత్వరమే రూపొందించాలని సూచించారు.

ten 2

ఫిక్సిడ్ డిపాజిట్ చేసే ఈ రూ.10 లక్షలు పై వచ్చే ఇంట్రెస్ట్ తో పిల్లల పోషణ సాగేలా ఉండాలన్నది జగన్ ఆలోచన. మహమ్మారి కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు ఆనాధలు, అభాగ్యులుగా మారకూడదన్న ఉద్దేశ్యంతో జగన్ చేసిన ఈ ఆలోచనకి ప్రజల నుండి మంచి ప్రశంసలు లభిస్తున్నాయి. ఇక ఇదే సమయంలో బ్లాక్ ఫంగస్ విషయంలో కూడా జగన్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ విస్తరిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో.. దీని బారిన పడి పేషెంట్లకు అందించే చికిత్సను డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చింది.

బ్లాక్ ఫంగస్తో బాధపడే వారు ఇతర రాష్ట్రాల్లో చికిత్స చేయించుకున్నప్పటికీ- ఆరోగ్యశ్రీ వర్తించే వెసలుబాటును కల్పించింది. బ్లాక్ ఫంగస్ చికిత్సకు అయ్యే ఖర్చు వెయ్యి రూపాయలు దాటితే.. అది ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోకి వస్తుందని తెలిపింది. ఇదివరకే కరోనా వైరస్ చికిత్స ఖర్చును జగన్ సర్కార్ ఈ పథకం కిందికి తీసుకొచ్చింది. అయితే.., బ్లాక్ ఫంగస్ విషయంలో భయపడాల్సిన అవసరం లేదని, రాష్ట్రంలో ఈ కేసులు చాలా తక్కువ ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం ఓ అధికారిక ప్రకటం విడుదల చేసింది.