ఎక్కడైనా నా పేరు తీస్తే కోర్టుకు వెళ్తా.. అనసూయ సీరియస్ వార్నింగ్

ఫిల్మ్ డెస్క్- తెలుగు మూవీ అర్టిస్ట్ అసోషియేషన్ ఎన్నికలు ముగిసినా మాటల యుధ్దం మాత్రం ఆగడం లేదు. ‘మా’ ఎన్నికలకు ముందు కంటే ఇంకా ఎక్కువ మోతాదులో రెండు వర్గాల మధ్య విమర్శలు, ఆరోపణలు పెరిగాయి. ‘మా’ ఎన్నికల్లో అనూహ్యంగా మంచు విష్ణు ప్యానెల్ విజయం సాధించింది. దీంతో ‘మా’ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన ప్రకాష్ రాజ్, ఆ తరువాత తన ప్యానెల్ తరపున గెలిచిని వారందరిచేత రాజీనామా చేయించడం ఆసక్తికరంగా మారింది.

ఇదిగో ఈ క్రమంలో జబర్దస్త్ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ వ్యవహారం గందరగోళంగా మారింది. మంగళవారం ప్రకాష్ రాజ్ మీడియా సమావేశం నిర్వహించి, తన ప్యానల్ తరుపున బరిలో నిలిచి గెలిచిన ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీకాంత్, జాయింట్ సెక్రటరీ ఉత్తేజ్, వైస్ ప్రెసిడెంట్ బెనర్జీలతో పాటు 8 మంది ఈసీ మెంబర్స్‌తో రాజీనామా చేయించారు. ఈ మీడియా సమావేశానికి అనసూయ కూడా వచ్చింది. ప్రకాష్ రాజ్ ప్యానెల్ తరపున అనసూయ సైతం ఈసీ మెంబర్ గా పోటీ చేసి ఓటమిపాలైంది.

అయితే ఆదివారం ‘మా’ పోలింగ్ రోజు యాంకర్ అనసూయ ఈసీ మెంబర్‌గా గెలిచిందని మొదట మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ సోమవారం ‘మా’ ఎన్నికల పూర్తి ఫలితాలు వచ్చాక అనసూయ ఓడిపోయిందని అధికారికంగా ప్రకటించారు ఎలక్షన్ అధికారులు. ఈ వ్యవహారంపై అనసూయ వ్యంగ్యంగా స్పందించింది. క్షమించాలి.. ఒక్క విషయం గుర్తొచ్చి తెగ నవ్వొచ్చేస్తుంది.. మీతో పంచుకుంటున్నా ఏమీ అనుకోవద్దే.. నిన్న అత్యధిక మెజారిటీ.. భారీ మెజారిటీతో గెలుపు అని ఈరోజు ఓడిపోయా అంటున్నారు.. రాత్రికి రాత్రి ఏం జరుగుతుందబ్బా.. నిన్న ఎవరో ఎన్నికల నియమాలకి భిన్నంగా బ్యాలెట్‌ పేపర్లని ఇంటికి కూడా తీసుకెళ్లారని బయట చెప్పుకుంటున్నారు’ అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు వేసింది అనసూయ.

Anasuya Bharadwaj 1

ఇదిగో ఇటువంటి పరిస్థితుల్లో మంగళవారం ప్రకాష్ రాజ్ నిర్వహించిన మీడియా సమావేశానికి మిగిలిన ప్యానల్ సభ్యులతో పాటు హాజరైన అనసూయ ఓడిపోయాననే ఫ్రస్ట్రేషన్‌‌లో మీడియాపై తన అసహనాన్ని ప్రదర్శించింది. తనపై తప్పుడు వార్తలు రాస్తే కోర్టుకు వెళ్తానంటూ మీడియాకు వార్నింగ్ ఇచ్చింది. ‘నా పర్సనల్ పనుల వల్ల హడావిడిగా వచ్చి ఓటు వేశాను.. ఆ తరువాత అక్కడే ఉన్నాను.. మాకు ఎవ్వరికీ తెలియని విషయాలు మీకు తెలిసిపోతున్నాయి.. ఓటింగ్ మొదలు కాకుండానే మీకు నచ్చినట్టు రాసేసుకుంటున్నారు.. అని అనసూయ చిందులు తొక్కింది.

ప్రెసిడెంట్ ఎన్నికలకు సంబంధించిన బ్యాలెట్ బాక్స్ ఇంకా ఓపెన్ చేయాలేదు.. బయట అప్పుడే గెలిచేశారని బ్రేకింగ్‌లు వేసేశారు..నేను బయటకు వస్తుంటే.. కంగ్రాట్స్ అన్నారు.. ఆ టైంలో నాకు తెలియదు.. ఇంకా అనౌన్స్ చేయలేదని చెప్పాను.. నేను ఓటమికి తలొగ్గే రకాన్ని కాదు.. నేను చాలా ధైర్య వంతురాల్ని.. ఎదుటివారు నువ్ ఓడిపోయావ్ అని చెప్తే వినేటంత పిరికిదాన్ని కాదు.. ఒకవేళ నేను గెలిచి ఉంటే.. చేసే సర్వీస్ మంచిగా ఉండేది.. ఎన్నికలు జరిగిన విధానంపై నాకు ఉన్న డౌట్లు సోషల్ మీడియాలో పెట్టా.. సమాధానాల కోసం ఎదురుచూస్తున్నా.. అని తీవ్రంగా స్పందించంది అనసూయ.

మీరు మైక్‌ లు పెట్టి నన్ను పొడిచేయొద్దు.. నన్ను కావాలనే ఘోరావ్ చేస్తున్నారు అని మీడియాపై ఫైర్ అయ్యింది యాంకర్ అనసూయ. చాల సహనంగా ఉండే అనసూయకు ఏమైందబ్బా అని అంతా ఆశ్చర్యపోయారు. ఓడిపోయిన ప్రస్టేషన్ లో ఉండి ఉంటుందిలే అని అందరు సమాధానపరుచుకున్నారు.