బెడ్ రూంలో, బాత్ రూంలో అలా.. వైరల్ అవుతున్న అనసూయ కామెంట్స్

స్పెషల్ డెస్క్- అనసూయ భరద్వాజ్.. ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం చేయక్కర్లేదు. అందులోను జబర్దస్త్ కామెడీ షో చూసేవారికైతే అనసూయ గురించి తెలిసిందే. జబర్దస్త్ షో లో కంటెస్టెంట్స్ చేసే స్కిట్స్ అంత పాపులరో, అనసూయ కూడా అంతే పాపులర్. ఇద్దరు పిల్లలకు తల్లైనా తన అందం, అభినయంతో జబర్దస్త్ కు ప్రత్యేకతను తీసుకువచ్చింది అనసూయ భరద్వాజ్.

ఇక జబర్దస్త్ షో మాత్రమే కాకుండా అప్పుడప్పుడు సినిమాల్లో కూడా నచిస్తూ అందరిని అలరిస్తోంది అనసూయ. ఇక ఈమె సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటుందని తెలుసు కదా. ఐతే అనసూయ సోషల్ మీడియాలో పెట్టే పోస్ట్‌లు చాలా వరకు వివాదాస్పదమవుతుంటాయి. అనసూయ షేర్ చేసే ఫోటోలు, చేసే కామెంట్లపై ఎప్పుడూ నెటిజన్లు ట్రోలింగ్ చేస్తూనే ఉంటారు. తాజాగా అనసూయ చేసిన ఓ పోస్ట్‌లో మహిళలు ఎదుర్కొనే సమస్యల గురించి, బాధల గురించి వివరించింది.

Anasuya 1

అనసూయ ఏంచెప్పిందంటే.. మహిళలు తమ కార్లలో, బాత్రూంలలో, బెడ్ రూంలలో ఒత్తిడిని భరించలేక ఎన్ని సార్లు ఏడుస్తారో తెలిస్తే కచ్చితంగా షాక్ అవుతారు.. అయితే ఎంత బాధ ఉన్నా కూడా తన మొహాన్ని బయటకు చూపించేటప్పుడు మాత్రం నవ్వుతూనే ఉంటుంది.. ఆఫీస్‌లకు వెళ్తుంటుంది.. ఇతర పనులను చేసుకుంటుంది.. ఇదీ అనసూయ తన పోస్ట్ లో చెప్పిన విషయం.

ఐతే అనసూయ ఏ సందర్బాన్ని బట్టి ఇలా మహిళల గురించిన అంశంలో పోస్ట్ పెట్టిందో మాత్రం చెప్పలేదు. ఏదేమైనా అనసూయ మహిళల గురించి వాస్తవం చెప్పిందని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం అనసూయ మూడు సినిమాల్లో నటిస్తోంది. మరో రెండు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. ఓ సినిమాలో స్పెషల్ సాంగ్ చేయడానికి కూడా ఈ జబర్దస్త్ బేబీ ఒప్పుకుందని సమాచారం.