అమెరికా క్రికెట్ టీంలో రికార్డుల మోత.. మోగించింది మనోడే

A indian Cricketer Record Hitting in America - Suman TV

6 బంతుల్లో 6 సిక్కులు అనగానే సగటు భారతీయ క్రికెట్ అభిమానికి గుర్తొచ్చే పేరు యువరాజ్ సింగ్. మొట్టమొదటి ట్వీ20 ప్రపంచ కప్ 2007లో ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో పేసర్ స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్ లో యువీ సృష్టించిన విధ్వంసం కళ్ల ముందు కనిపిస్తుంది. ఆ తర్వాత కూడా మరికొందరు క్రికెటర్లు ఒకే ఓవర్లో 6 సిక్సులు బాదారు. కానీ ఇప్పుడిప్పుడే క్రికెట్ సముద్రంలో ఈత నేర్చుకుంటున్న జట్టు సభ్యుడు ‘6 ఇన్ 6’ను రిపీట్ చేస్తే కచ్చితంగా సంచలనమే. అతనేవరో కాదు అమెరికా జాతీయ క్రికెట్ జట్టు సభ్యుడు, భారతీయ సంతతికి చెందిన జస్కరన్​ మల్హోత్రా.

గురువారం ఓమన్​ వేదికగా పపువా న్యూగినియా, అమెరికా జట్లు అంతర్జాతీయ వన్డేలో తలపడ్డాయి. ఈ మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్​ చేసిన అమెరికా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 271 పరుగులు చేసింది. అమెరికా ప్లేయర్స్ అందరూ విఫలమయినా.. భారత సంతతికి చెందిన జస్కరన్​ మల్హోత్రా భారీ ఇన్నింగ్స్ ఆడాడు. పపువా న్యూగినియా ఏ బౌలర్‌ను వదలకుండా బాదాడు. 124 బంతుల్లో 173 రన్స్ చేశాడు. మల్హోత్రా తన ఇన్నింగ్స్‌లో కేవలం 4 బౌండరీలు మాత్రమే బాది.. ఏకంగా 16 సిక్సులు కొట్టాడు. బౌండరీల ద్వారానే 100కు పైగా పరుగులు చేశాడు.

A indian Cricketer Record Hitting in America - Suman TVఈక్రమంలోనే ఒకే ఓవర్​లోని ఆరు సిక్సులు బాదాడు. అమెరికా ఇన్నింగ్స్​లోని ఆఖరి ఓవర్​ను పపువా న్యూగినియా పేసర్​ గౌడి టోకా వేశాడు. అదే ఓవర్​లోని ఆరు బంతులను జస్కరన్​ మల్హోత్రా ఆరు సిక్సర్లు బాది అందర్ని ఆశ్చర్యపరిచాడు. దీంతో ఆ మ్యాచ్​లో 173 వ్యక్తిగత స్కోరు నమోదు చేశాడు మల్హోత్రా. దాంతో మల్హోత్రా అంతర్జాతీయ వన్డేలో రికార్డు నెలకొల్పాడు. మల్హోత్రా దెబ్బకు గౌడి టోకా 7 ఓవర్లలోనే 66 రన్స్ సమర్పించుకున్నాడు. అమెరికా క్రికెట్​ చరిత్రలో ఇది రెండో అత్యధిక వ్యక్తిగత స్కోరు. అంతేకాకుండా అమెరికా క్రికెట్​ జట్టుకు వన్డే హోదా వచ్చిన తర్వాత సెంచరీ సాధించిన తొలి బ్యాట్స్​మన్​గా ​ మల్హోత్రా రికార్డు నెలకొల్పాడు. అంతకుముందు 2019లో యూఏఈ వేదికగా జరిగిన వన్డేలో
అరోన్​ జాన్స్​(95) శతకం దగ్గరగా వచ్చి ఔట్ అయ్యాడు.