పెళ్లి బరాత్ లోకి అంబులెన్స్ డ్రైవర్ పీపీఈ కిట్ తో డాన్స్ అదుర్స్

ఉత్తరాఖండ్ (నేష్నల్ డెస్క్)- కరోనా మహమ్మారి అంతకంతకు విజృంభిస్తోంది. ఎక్కడ చూసినా కరోనా రోగులను తీసుకెల్తున్న అంబిలెన్స్ ల సైరన్ లే విన్పిస్తున్నాయి. ఈ క్లిష్ట సమయంలో అంబులెన్స్లు నిరంతరాయంగా కరోనా రోగులను ఆస్పత్రులతు చేరవేస్తున్నాయి. దీంతో అంబులెన్స్ ల డ్రైవర్లు శ్రమకోర్చి డ్యూటీ చేస్తున్నారు. వారంతా పీపీఈ కిట్లు ధరించి అంబులెన్సులను నడుపుతున్నారు. బిజీ డ్యూటీలో ఏ మాత్రం సమయం దొరికినా విశ్రాంతి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదిగో ఇటువంటి సమయంలో ఓ అంబులెన్స్ డ్రైవర్ సరదాగా చేసిన పని వారు ఎంత కష్టపడుతున్నారో చెప్పడానికి అద్దం పడుతోంది. ఉత్తరాఖండ్ హల్ద్వానీ నగరంలో ఓ కళాశాల వద్ద కొద్ది మందితోనే పెళ్లి బరాత్ వెళ్తోంది. ఈ సమయంలో అటువైపు నుంచి వెళ్తున్న అంబులెన్స్ వచ్చిన డ్రైవర్ మహేశ్ బరాత్ ను చూసి తన వాహనాన్ని పక్కన ఆపేశాడు. వెంటనే అంబులెన్స్ నుంచి కిందకు దిగి పీపీఈ కిట్లోనే బరాత్ మధ్యలోకి వచ్చి డాన్స్ చేయడం మొదలుపెట్టాడు. బ్యాండ్ మేళానికి తగ్గట్టుగా తీన్మార్ స్టెప్పులేశాడు. మ్యూజిక్ అనుగుణంగా స్టెప్పులేస్తూ తన పని ఒత్తిడిని మరిచేలా ఆదమరిచి డ్యాన్స్ చేశాడు మహేశ్. ఇలా పెళ్లి బరాత్ లో అకస్మాత్తుగా ప్రత్యక్షమైన పీపీఈ కిట్ అంబులెన్స్ డ్రైవర్ను చూసి పెళ్లివారు ముందు కాస్త కంగారు పడ్డారు. కొంత సేపటికి తేరుకున్నాక ఆ డ్రైవర్ ఆనందంతో డ్యాన్స్ చేస్తుండడంతో అతడిని వారించకుండా పెళ్లివారంతా ఎంకరేజ్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. కరోనా రోగులకు అలుపెరగకుండా సేవలందిస్తూ.. అలిసిపోయి ఇలా కాసేపు డాన్స్ తో సేదతీరడం పట్ల అంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here