వావ్.. సిక్స్ ప్యాక్ లో అక్కినేని సమంత, నడుము చూస్తే ఫిదా

ఫిల్మ్ డెస్క్- బాలీవుడ్ నుంచి మొదలు టాలీవుడ్ వరకు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు సిక్స్ ప్యాక్ సాధించారు. కానీ సిక్స్ ప్యాక్ అంటే అంత ఆశామాషీ వ్యవహారం కాదు. దీని కోసం గంటల తరబడి జిమ్ లో కసరత్తులు చేయాలి. చాలా కష్టతరమైన ఆహార నియమాలను పాటించాల్సి ఉంటుంది. అందుకే సిక్స్ ప్యాక్ అందరికి సాధ్యం కాదు. టాలీవుడ్ లో చాలా మంది హీరోలకు సిక్స్ ప్యాక్ ఉంది.

ఇక సినిమా పరిశ్రమలో హీరోలంత కాదు గాని, మంచి ఫిగర్ కోసం హీరోయిన్లు సైతం బాగానే కసరత్తులు చేస్తుంటారు. తన బాడీని ఎప్పుడూ ఫిట్ గా ఉంచుకునేందుకు చాలా కష్టపడుతుంటారు. ముఖ్యంగా తమ బాడీను ఫిట్ గా ఉంచుకుంటూ.. ఆబ్స్ కోసం ప్రయత్నిస్తున్నారు హీరోయిన్లు. రకుల్ ప్రీత్ సింగ్, సమంత లాంటి తారలు ఈ లిస్ట్ లో ముందుంటారని చెప్పవచ్చు.

Samantha pic

ఇక అక్కినేని వారి కోడలు సమంత జిమ్ లో వెయిట్ లిఫ్ట్ లు చేస్తూ తన పొట్టను ఫ్లాట్ చేసేసి ఔరా అనిపిస్తోంది. సమంత తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలో ఆబ్స్ ను చూస్తే ఇది సిక్స్ ప్యాక్ అనిపించక మానదు. ఎక్కడా కాసింత కూడా ఫ్యాట్ లేకుండా, పెర్ఫెక్ట్ ప్యాక్ తో కూడిన బాడీతో అందరిని ఆశ్చర్యపరిచింది. సాధారనంగానే సమంత ఎప్పటికప్పుడు తన వర్కవుట్ కి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది.

ఇప్పుడు ఈ బ్యూటీ హ్యాండ్ బ్యాగ్ కి సంబంధించిన బ్రాండ్ ను ప్రమోట్ చేస్తుంది. ఈ క్రమంలో సమంత సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అక్కినేని సమంత సిక్స్ ప్యాక్ బాడీకు అభిమానులు ఫిదా అయిపోతున్నారు. ఒక్క ఇన్ స్టాగ్రామ్ ప్రమోషన్స్ తోనే ఈ సిక్స్ ప్యాక్ బ్యూటీ లక్షల్లో డబ్బులు సంపాదిస్తుంది. తాజాగా గోవా ట్రిప్ కు వెళ్లిన సమంత, అందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో చాలా బిజీగా గడుపుతోంది.

 

View this post on Instagram

 

A post shared by S (@samantharuthprabhuoffl)