తల్లిగా ప్రమోషన్ పొందిన హీరోయిన్ శ్రియ.. ఆనందం అంతా ఇంతా కాదు

ఫిల్మ్ డెస్క్ హీరోయిన్ శ్రియ శరణ్ గుర్తుంది కదా.. దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు నెంబర్ వన్ హీరోయిన్ గా ఎదిగిన శ్రియ, ఇప్పటికీ అడపా దడపా సినిమాల్లో నటిస్తూనే ఉంది. తెలుగు, తమిళ్, మలయాళంలో అగ్ర హీరోలందరితో శ్రియ నటించింది. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్, ప్రభాస్, రజినీకాంత్ వంటి వారందరి సరసన ఆడి పాడింది శ్రియ శరణ్.

ఐతే కొన్నాళ్లుగా శ్రియ శరణ్ సినిమాలకు దూరంగా ఉంటూ వస్తోంది. ఇందుకు కారణం ప్రేమ, పెళ్లి. అవును రష్యాకు చెందిన బిజినెస్ టైకూన్, టెన్నిస్ ప్లేయర్ అయిన అండ్రీ కోషీవ్‌ను శ్రియ శరణ్ 2018లో ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ జంట మొదటిసారిగా మాల్దీవుల్లో కలుసుకున్నారు. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. రాజస్థాన్ లోని ఉదయ్‌ పూర్‌లో 2018లో వీరు పెళ్లి చేసుకున్నారు.

shriya 1

శ్రియ, అండ్రీ వివాహనికి కుటుంబ సభ్యులు, దగ్గరి బంధువులు మాత్రమే హాజరయ్యారు. పెళ్లి తరువాత శ్రియ దంపతులు రష్యాలో ఉంటూ వస్తున్నారు. ఆ తరువాత కొన్నాళ్లకు ఇండియాకు విచ్చేసి, ముంబైలోని బాంద్రాలో నివాసం ఉంటున్నారు. ఈ సంవత్సరం ప్రారంభంలో తమకు కూతరు పుట్టిందని ఒక వీడియో ద్వారా అభిమానులకు తెలిపింది శ్రియ శరణ్.

ఈమేరకు ట్వీట్టర్ లో ఓ వీడియోను పోస్ట్ చేసింది శ్రియ. ఆమె ఏమందంటే.. ‘‘2020 మొత్తం ప్రపంచాన్ని తలకిందులు చేసింది. కరోనా వ్యాప్తి కారణంగా అంతా సంవత్సరం పాటు క్వారంటైన్‌లో వెళ్లిగా.. మా జీవితంలో మాత్రం ఓ అద్భుతం జరిగింది. దేవుడు మాకు ఒక ఏంజిల్‌ లాంటి చిన్నారిని ప్రసాదించాడు. అందుకు ఆయనకు రుణపడి ఉంటాను. ఈ చిన్నారి రాకతో మా జీవితంలో ఓ అద్భుతం జరిగింది’ అంటూ ఓ వీడియోని షేర్ చేసింది. అన్నట్లు శ్రియ శరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్, గమనం, నాగసూరన్ తదితర సినిమాల్లో నటిస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by Shriya Saran (@shriya_saran1109)