విడాకుల తరువాత అరుదైన రికార్డు సాధించిన సమంత

ఫిల్మ్ డెస్క- సమంత.. ఇప్పుడు టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఎక్కడ చూసినా ఈమె విడాకుల గురించే చర్చ. అవును నాగచైతన్య, సమంతలు విడిపోతున్నట్లు ప్రకటించినప్పటి నుంచి అసలేం జరిగిందని అంతా ఆరా తీస్తున్నారు. సమంత ఏం మాయ చేశావే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనప్పటి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు. మొదటి సినిమాతో ప్రేక్షకుల మనస్సు దోచుకున్న సమంత, ఆ తర్వాత తెలుగుతో పాటు తమిళంలో స్టార్ హీరోలందరితో నటించింది.

దాదాపు సమంత తెలుగులో నెంబర్ వన్ హీరోయిస్ స్థాయికి ఎదిగింది. అక్కినేని నాగచైతన్యతో ఏంమాయ చేశావే సినిమాలో నటించిన సమంత, అతనితో ప్రేమలో పడింది. కొంత కాలం ప్రేమించుకున్న వీళ్లిద్దరు, 2017లో పెళ్లి చేసుకున్నారు. వివాహం తర్వాత కూడా సమంత, నాగచైతన్య కలిసి మజలీ సినిమాలో నటించారు. ఆ తరువాత ఎవరికి వారు సినిమాలు చేస్తూ అన్యోన్యంగానే ఉన్నారు. మరి అంతలో ఏమైందో ఏమో గాని ఇద్దరు విడిపోతున్నట్లు ప్రకటించారు.

Actress Samantha 1

చాలా రోజుల నుంచి వీరిద్దరు విడిపోతున్నారంటూ ప్రచారం జరుగుతూ వస్తోంది. ఆ ప్రచారాన్ని నిజం చేస్తూ వీరిద్దరు అధికారికంగా విడాకులను ప్రకటించి అందరి జలక్ ఇచ్చారు. ఇక సమంత నాగచైతన్యతో విడిపోతున్నట్లు ప్రకటించిన తరువాత అరుదైన రికార్డు సాధించింది. సాధారణంగానే సమంత సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తనకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది.

ఈ క్రమంలో తాజాగా సమంత మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకుంది. సోషల్‌ మీడియాలో అత్యంత పాపులర్ హీరోయిన్ల జాబితాలో సమంత మొదటి స్థానంలో నిలిచింది. కాజల్ అగర్వాల్‌ను వెనక్కు నెట్టి, సమంత మొదటి స్థానంలోకి వచ్చింది. సమంత, కాజల్ తర్వాతి స్థానాల్లో రష్మిక మందాన, తమన్నా, కీర్తి సురేశ్, పూజా హెగ్డే, రకుల్ ప్రీత్ సింగ్, రాశీ ఖన్నా, సాయి పల్లవి ఉన్నారు. అన్నట్లు సమంత ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం అనే సినిమాలో నటిస్తుండగా, మరో రెండు మూడు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి.