‘బల్లి’ పేరుని తౌక్టే అని ఎవరు ఎందుకు పెట్టారు!?.

మీటియోర్లోజికల్ డిపార్ట్మెంట్ మే 16 నుండి మే 18 వరకు తుఫాన్ ఉంటుందని హెచ్చరించింది. ఈ మూడు రోజులు వుండే తుఫాన్ పేరు టౌక్టె అని పెట్టారు. ఈ తుఫాన్ కి పేరు ఏ దేశం పెట్టింది అనేది చూస్తే  ఈ తుఫాను కి పేరు మైనమార్ ఇచ్చింది. టౌక్టె అనే మాటకి అర్థం బల్లి . ఈ సంవత్సరానికి ఇదే మొట్టమొదటి తుఫాన్. అయితే తుఫాన్లకు పేర్లు నేషనల్ మీటర్స్లోజికల్ అండ్ హైడ్రొలోజికల్ సర్వీసెస్ పెడుతుంది. భారత వాతావరణశాఖ రాబోయే తుపానుల పేర్ల జాబితాను ఇటీవల విడుదల చేసింది. వీటిలో అర్నబ్‌, నిసర్గ, ఆగ్‌, వ్యోమ్‌, అజర్‌, పింకూ, తేజ్‌, గాటి, లులు తదితర 160 పేర్లు ఉన్నాయి. వీటిని హిందూ మహాసముద్రం తీరప్రాంతంగా కలిగిన 13దేశాలు ఈ పేర్లను నిర్ణయిస్తాయి. వీటిలో భారత్‌, బంగ్లాదేశ్‌, ఇరాన్‌, మాల్దీవులు, మియన్మార్‌, ఒమన్‌, పాకిస్థాన్‌, ఖతార్‌, సౌదీ అరేబియా, శ్రీలంక, థాయిలాండ్‌, యూఏఈ, యెమెన్‌ దేశాలు ఉన్నాయి. ఒక్కో దేశం 13పేర్లను సూచించాలి. తాజాగా విరుచుకుపడిన ‘అంపన్‌’పేరు థాయిలాండ్‌ సూచించింది. ఈ పేరుతో 2004లో ప్రతిపాదించిన 64 పేర్లు పూర్తయ్యాయి. ఇప్పుడు కొత్తగా 169 పేర్లను ప్రతిపాదించారు. 2004లో తొలిసారి ప్రచురించగా ఆ జాబితాలో అంపన్‌ చివరిది. 2019లో అరేబియా సముద్రంలో ఐదు తుపానులు ఏర్పడ్డాయి. 1902లోనూ ఐదు తుపాన్లు ఏర్పడ్డాయి. 1902 తరువాత అంత సంఖ్యలో తుపాన్లు రావడం 2019లోనే కావడం విశేషం. ఒకప్పుడు తుపానుకు ఎలాంటి పేరు ఉండేది కాదు, ఫలానా సంవత్సరంలో తుపాను అంటూ పిలిచేవారు. తుపాను వాతావరణం ఏర్పడినప్పుడల్లా దాన్ని అదే పేరుతో పిలవడం వల్ల తికమకపడే అవకాశం ఉంది. ఇలా ఒక్కో తుపానుకు ఒక్కో పేరు పెడితే డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌కు, మీడియాకు, సాధారణ ప్రజలకు ఇది ఫలానా తుపాను అని గుర్తుండిపోతుంది. అంతేకాకుండా ఆ పేరుతో ప్రజలను అప్రమత్తం చేసే అవకాశం ఉంటుందంటున్నారు వాతావరణ నిపుణులు.

974246 tauktae cyclone

తుపాన్లకు పేర్లు పెట్టే సంప్రదాయన్ని 2000 సంవత్సరంలో యునైటెడ్‌ నేషన్స్‌ ఎకనామిక్‌ అండ్‌ సోషల్ కమిషన్‌ ఫర్‌ ఏసియా అండ్‌ పసిఫిక్‌, ఇంకా వరల్డ్‌ మెట్రలాజికల్‌ ఆర్గనైజేషన్‌ సంయుక్తంగా ప్రారంభించాయి. ఈ గ్రూపులో ఇండియా, బంగ్లాదేశ్‌, మాల్దీవులు, మయన్మార్‌, ఒమన్‌, పాకిస్తాన్‌, శ్రీలంక, థాయ్‌లాండ్‌ దేశాలున్నాయి. ఒక్కోదేశం 13 పేర్లతో ఒక జాబితాను సిద్ధం చేసింది. బంగాళాఖాతం, అరేబియా సముద్రాలలో పుట్టే తుపాన్లకు ఈ పేర్లు పెడతారు. 2018లో ఇరాన్‌, ఖతార్‌, సౌదీ అరేబియా, యూఏఈ, యెమెన్‌ దేశాలు కూడా ఈ గ్రూపులో చేరాయి. ఈ దేశాల సభ్యులతో ఏర్పాటైన ప్యానెల్‌ తుపాన్ల పేర్లను నిర్ణయిస్తుంది. ప్యానెల్‌ సభ్యులు ప్రతిపాదించిన పేర్లను ఆయా దేశాల అక్షర క్రమంలో ఉంచుతారు. ఈ దేశాల జాబితాలో మొదటి పేరు బంగ్లాదేశ్‌ది కాగా, భారత్‌ పేరు రెండో పేరు. ఆ తర్వాత ఇరాన్‌, మాల్దీవులు, ఒమన్‌, పాకిస్తాన్‌, ఖతార్‌ ఇలా కొనసాగుతాయి.