హైదరాబాద్ జూ పార్క్ లో 8 సింహాలకు కరోనా

Lions infected with covid

హైదరాబాద్- కరోనా మహమ్మారి పగబట్టి మరీ ముషులను పట్టి పీడిస్తోంది. ఐతే ఇప్పటివరకు మనుషలవరకే పరిమితం అనుకున్న కరోనా ఆఖరితి జంతువులము కూడా వదలడం లేదు. ప్రపంచం వ్యాప్తంగా అక్కడక్కడా జంతువులను కరోనా సోకిందన్న వార్తలు వింటున్నా.. ఇప్పుడు అది తెలంగాణకు కూడా పాకింది. హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్క్‌లో 8 ఆసియా సింహాలు కరోనా బారినపడడం కలకలం రేపుతోంది. కొన్ని రోజులుగా సింహాల్లో కరోనా లక్షణాలు కనిపించడంతో గత నెల 24న నమూనాలు సేకరించిన జూ అధికారులు వాటిని పరీక్షల నిమిత్తం సీసీఎంబీకి పంపించారు. ఆ ఎనిమిది సింహాలకు కరోనా వైరస్ సంక్రమించినట్టు తాజా పరీక్షల్లో తేలింది. దీంతో అప్రమత్తమైన జూ అధికారులు సింహాలను ఐసోలేషన్‌లో ఉంచారు. వాటికి అవసరమైన చికిత్స అందిస్తున్నారు.

సింహాలు సాధారణంగానే ఉన్నాయని, బాగానే ఆహారం తీసుకుంటున్నాయని జూ అధికారులు తెలిపారు. అలాగే, ముందు జాగ్రత్త చర్యగా సందర్శకులను నిలిపివేశారు. సింహాలకు కరోనా సోకడంతో నెహ్రూ జూ పార్క్ చుట్టుపక్కల నిలసించే వారు ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు.