సుమన్ టీవీ పాఠకులకు మే డే శుభాకాంక్షలు

స్పెషల్ డెస్క్- మేడే.. నేడు అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం. కార్మికులకు ఎనిమిది గంటల పని విధానం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ 1886, మే 1న అమెరికా షికాగోలని హే మార్కెట్లో జరిగిన పోరాటాన్నే ఈ రోజు మే డే గా జరుపుకుంటున్నాం. ఆ రోజు జరిగిన ఈ ఉద్యమానికి మద్దతుగా నాలుగు రోజుల తర్వాత షికాగోలోని హే మార్కెట్‌లో భారీ ప్రదర్శన నిర్వహించారు. అది ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ సంఘటనలో చాలా మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనను నిరసిస్తూ ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో కార్మిక ఉద్యమాలు జరిగాయి. షికాగో మారణకాండలో ప్రాణాలర్పించిన కార్మికులను స్మరిస్తూ.. ప్రతి సంవత్సరం మే 1వ తేదీన కార్మిక దినోత్సవం నిర్వహిస్తున్నారు. అప్పటి నుంచి మే 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా అనేక ఉద్యమాలకు మే డే వేదికగా మారింది.

చాలా దేశాల్లో ఆ రోజున పోరాటాలూ, నిరసన ప్రదర్శనలూ చేపట్టడం అనవాయితీ. ఇక మన దేశంలో 1923 నుంచి మే డే ను పాటిస్తున్నారు. కరోనా వల్ల గతేడాది నుంచి ఎంతోమంది శ్రమ జీవులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. వారిలో ధైర్యం నింపడం మన అందరి కర్తవ్యం. శ్రామిక సోదరులకు మే డే శుభాకాంక్షలు. కార్మిక శక్తి వర్దిల్లాలి.