శరీరంలోకి కరోనా ఎక్కించుకుంటున్న యువకుడు

లండన్ (ఇంటర్నేషనల్ డెస్క్)- కరోనా.. ఇప్పుడు ఈ పేరు వింటేనే వెన్నులో వణుకు పుడుతోంది. గత యేడాది దాడి ప్రారంభించిన ఈ మహమ్మారి ఇంకా మముషులపై దండయాత్ర చేస్తూనే ఉంది. ఎవరు తుమ్మినా, దగ్గినా సరే ముందు వారికి వైరస్ సోకిందనే అనుమానమే వస్తోంది. ఇలాంటి సమయంలో ఓ 23 ఏళ్ల యువకుడు తనకు కరోనా వైరస్ ఎక్కించాలని కోరుతున్నాడు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది అక్షరాల నిజం. ఇలా కరోనా వైరస్‌ను స్వయంగా ఎక్కించుకుంటున్న ఈ యువకుడు డర్హమ్‌కు చెందిన అతని పేరు జాకబ్ హాప్‌కిన్స్. ఐతే హాప్‌కిన్స్ ఏదో సరదా కోసం వైరస్ ఎక్కించుకోవడం లేదు. ఇదో హ్యూమన్ ట్రయల్ ఛాలెంజ్ అన్నమాట. దీనివల్ల కరోనా వైరస్ గురించి మరింత లోతుగా అర్థం చేసుకునే అవకాశం శాస్త్రవేత్తలకు కలుగుతుంది. ఈ క్రమంలో ఇలా వ్యాక్సిన్ ట్రయల్స్ నిర్వహించడం కోసం యూకే ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇదిగో ఈ ప్రణాళికలో భాగంగానే వైరస్ ఎక్కించుకోవడానికి వాలంటీరుగా హాప్‌ కిన్స్ ముందుకు వచ్చాడు. ఒక చోట క్వారంటైన్ పెట్టిన పోలీసులు.. వైరస్ వ్యాప్తిని పరిశీలించడం కోసమే ఈ హ్యూమన్ ట్రయల్స్ నిర్వహిస్తున్నారు.

ఇలా కరోనా వైరస్ ను ఎక్కించుకోవడం అంటే కిడ్నీ డొనేట్ చేసే శస్త్రచికిత్స కన్నా మూడు రెట్లు తక్కువ రిస్క్ అని హాప్‌కిన్స్ చెప్పాడు. ఈ వైరస్‌ ఎక్కించుకున్న తర్వాత హాప్‌కిన్స్‌ను 24 గంటల శాస్వవేత్తలు పరిశీలిస్తారు. ఈ మానవ ట్రయల్స్‌లో భాగంగా ఎంపిక చేసిన అతి కొద్ది మంది వాలంటీర్లకు కరోనా వైరస్ ఎక్కిస్తారు. ఆపై వారిని జాగ్రత్తగా పరిశీలించడం వల్ల వైరస్ ఎలా వ్యాపిస్తుంది, దీనిపై వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుంది వంటి ప్రశ్నలకు సమాధానం లభించే అవకాశం ఉంది.