మైక్రోసాఫ్ట్ అధినేత సంచలన నిర్ణయం, విడిపోనున్న బిల్ గెట్స్ జంట

118310618 gettyimages 800605038

ఇంటర్నేషనల్ డెస్క్- ప్రముఖ టెక్ దిగ్గజ కంపెనీ మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, ప్రపంచ కుబేరులలో ఒకరైన బిల్​గేట్స్ జంట విడిపోతోంది. ఈ మేరకు ఆయన భార్య మిలిందా గేట్స్ సంచలన ప్రకటన చేశారు. 27 ఏళ్ల తమ వైవాహిక బంధానికి గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నట్లు ఆమె చెప్పారు. గత 27 ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సేవా కార్యక్రమాలతో మంచి గుర్తింపు పొందింది బిల్, మిలిందా గెట్స్ జంట. ఇకపై దంపతులుగా కలిసి ఉండలేమని భావిస్తున్నట్లు వారు తెలిపారు. జీవితంలో ఇక భార్యాభర్తలుగా కలిసి ఉండలేమని ఇరువురు సంయుక్త ప్రకటన చేసి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తారు. తమ బిల్‌-మిలిందా గేట్స్‌ ఫౌండేషన్‌ ద్వారా స్వచ్ఛంద కార్యక్రమాలు మాత్రం ఎప్పటిలాగే కొనసాగిస్తామని ఇరవురు తెలిపారు. 27 ఏళ్ల మా వివాహ బంధానికి ముగింపు పలకాలని మేమిద్దరం నిర్ణయించుకున్నాం.. ముగ్గురు పిల్లలను పెంచి పెద్ద చేశాం.. ప్రపంచంలోని ప్రజలందరికీ మంచి ఆరోగ్యం, మెరుగైన జీవనం కల్పించే ఫౌండేషన్​ను స్థాపించాం.. ఈ ఫౌండేషన్​ కోసం మేము కలిసే పనిచేస్తాం.. ఐతే జీవితంలోని తర్వాతి దశల్లో మేము దంపతులుగా కొనసాగలేమని భావిస్తున్నాం.. అని తమ సంయుక్త ప్రకటనలో బిల్‌గేట్స్ దంపతులు స్పష్టం చేశారు.

E0fXNyNUYAAWfXS

1994లో వివాహబంధంతో ఒక్కటైన బిల్‌గేట్స్ దంపతులు 27 ఏళ్ల తర్వాత విడిపోతుండడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రస్తుతం బిల్‌గేట్స్ ప్రపంచ కుబేరుల జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నారు. గత ఫిబ్రవరి నాటికి ఆయన ఆస్తి విలువ 137 బిలియన్ డాలర్లు. ఇకపోతే 2000లో స్థాపించిన బిల్‌-మిలిందా గేట్స్‌ ఫౌండేషన్‌ ద్వారా ఇప్పటివరకూ 53 బిలియన్‌ డాలర్లను వివిధ స్వచ్ఛంద కార్యాక్రమాలకు ఖర్చు చేశారు.