తెలంగాణలో మే 8 వరకు నైట్ కర్ప్యూ పొడగింపు

హైదరాబాద్- తెలంగాణలో నైట్ కర్ప్యూను పొడగించారు. ఈమేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రేపటి నుంచి మే 8 వ తేదీ వరకు నైట్ కర్ప్యూను పొడగిస్తూ కేసీఆర్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. హైకోర్టులో విచారణ సందర్బంగా తెలంగాణ ప్రభుత్వంపై కోర్టు సీరియస్ అయ్యింది. నేటితో కర్ప్యూ ముగుస్తున్న నేపధ్యంలో ఇంకా ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోవడంపై కోర్టు సీరియస్ అయ్యింది. 45 నిమిషాల్లో తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకోవాలని, లేదంటే తామే నిర్ణయం తీసుకుంటామని ధర్మాసనం వ్యాఖ్యానించింది. దీంతో ప్రభుత్వం ఆగమేఘాల మీద నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల మే 8 వరకు నైట్ కర్ప్యూ ను పొడగిస్తున్నట్లు కేసీఆర్ సర్కార్ ప్రకటించింది. ఈ మేరకు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. యధావిధిగా రాత్రి తొన్నిది గంటల నుంచి ఉదయం ఐద గంటల వరకు కర్ప్యూ కొనసాగుతుంది. గంట ముందే అంటే రాత్రి 8 గంటల వరకే షాపులు, వాణిజ్య సముదాయాలన్ని మూసేయ్యాలి. లేదంటే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.