తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో వైసీపీ విజయం

తిరుపతి- ఆంద్రప్రదేశ్ లోని తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి భారీ ఆధిక్యంతో విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మిపై 2 లక్షల 65 వేలకు పైగా ఓట్ల మెజార్టీతో గురుమూర్తి గెలిచారు. ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి గురుమూర్తి ఆధిక్యంలోనే కొనసాగారు. మొత్తం 25 రౌండ్లు పూర్తయ్యే సరికి భారీ మెజార్టీతో పనబాక లక్ష్మిపై గురుమూర్తి గెలుపొందారు. ఈ విజయంతో వైసీపీ అభ్యర్థి గురుమూర్తి అనుచరులు, వైసీపీ కార్యకర్తలు, స్థానిక నేతలు సంబరాలు జరుపుకున్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ 2 లక్షల 28 వేలకు పైగా ఓట్ల మెజార్టీ వచ్చింది.

గత ఎన్నికతో పోల్చుకుంటే ప్రస్తుతం వైసీపీకి సుమారు 40 వేల ఓట్లు ఎక్కవ వచ్చాయి. ఐతే దొంగ ఓట్లతోనే వైసీపీ తిరుపతిలో గెలిచిందని ప్రతి పక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఇది ప్రజల విజయమని వైసీపీ పార్టీ వ్యాఖ్యానిస్తోంది.