తిరుపతి ఎన్నికల్లో రికార్డు సృష్టించిన సర్వేపల్లి నియోజకవర్గం

kakani govardhan reddy

నెల్లూరు- తిరుపతి పార్లమెంట్ స్థానానికి జరిగిన ఉపఎన్నికలో సర్వేపల్లి అసెంబ్లీ సెగ్మెంట్ లో వైసీపీ విజయదుంధిబి మోగించింది. సర్వేపల్లి అసెంబ్లీ నియోజకవర్గం చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా రికార్డ్ స్థాయిలో 40 వేల 895 ఓట్ల మెజారిటీ వచ్చింది. సర్వేపల్లి శాసనసభ నియోజకవర్గ చరిత్రలో ఇంత భారీ మెజార్టీ ఎప్పుడూ రాలేదని విశ్లేషకులు చెబుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల కంటే ఇప్పుడు ఎంపీ ఎన్నికల్లో దాదాపు 25 వేలు ఎక్కువగా మెజారిటీ వచ్చింది. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికను స్థానిక ఎమ్మెల్యే కాకాణి గోవర్ధనరెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకుని, రేయింబవళ్లు పని చేసి ఇంత భారీ మెజార్టీ సాధించారని వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి. కాకాణి గోవర్ధన్ రెడ్డిని ముఖ్యమంత్రి జగన్ ప్రత్యేకంగా అభినందించారట.