చెమట వాసన ద్వార కరోనా పరీక్షలు

d41586 020 03149 9 18553632

రీసెర్చ్ డెస్క్- కరోనా ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. కరోనా సోకడం ఒక ఎత్తైతే.. దాన్ని పరీక్షించుకోవడం మరో ఎత్తు. ఎందుకంటే కరోనా సోకిందా లేదా పరీక్ష చేసుకుంటే కనీసం ఒక రోజు తరువాత గాని ఫలితం రాదు. దీంతో చాలా మంది కరోనా అనుమానితులు కొవిడ్ రిజల్ట్స్ కోసం ఎదరుచూడక తప్పడం లేదు. ఇక ఇప్పుడు దీని నుంచి ఉరట లభించే అంశం తెరపైకి వచ్చింది. ఈ భయంకరమైన వైరస్ బారిన పడిన రోగి శరీరం నుంచి వచ్చే చెమట ప్రత్యేకమైన వాసన కలిగి ఉంటుందని పారిస్ కు చెందిన పరిశోధకులు తేల్చారు. వారు కొన్ని పరిశోధనలు చేసి ఆ విషయాలను వెల్లడించారు. ఇప్పుడు దీని ఆధారంగా వైరస్ రోగులను గుర్తించే పనిలో పడ్డారు. మనిషి చెమట వాసనతో వైరస్ నిర్ధారించే శక్తి కుక్కలకు ఉందని తేల్చిన పరిశోధకులు వాటి ద్వారా ఈ వైరస్ రోగులను గుర్తించడం ప్రారంభించారు. పేలుడు పదార్థాలు, బాంబులను, ప్రమాదకర రసాయనాలను గుర్తించినట్టే.. ఒక వ్యక్తికి వైరస్ సోకిందో లేదో గుర్తించే శునకాల వచ్చేశాయి. ఈ మేరకు కుక్కలకు ప్రత్యేక శిక్షణ శాస్త్రవేత్తలు ఇచ్చారు. భవిష్యత్తులో రోగ లక్షణాలు కనిపించక ముందే వైరస్ సోకిన వ్యక్తిని గుర్తించేలా కుక్కలకు ట్రైనింగ్ ఇచ్చారు. మనుషుల్లో మలేరియా పార్కిన్సన్స్ క్యాన్సర్ వంటి వ్యాధులను గుర్తించేలా గతంలో శునకాలకు శిక్షణ ఇచ్చిన నిపుణులు సైతం ఈ ప్రాజెక్టులో భాగస్వాములు అయ్యారు.

ఇందులో భాగంగా బెల్జియమ్ మలినోస్ షెపర్డ్ జాతికి చెందిన శునకాలకు అల్ఫోర్ట్ లోని నేషనల్ వెటర్నరీ స్కూల్ లో ప్రత్యేక ట్రైనింగ్ ఇచ్చారు. చెమట వాసన చూసి ఈ వైరస్ ఉందో లేదో పసిగట్టేలా ట్రైన్ చేశారు. తొలి దశలో కరోనా రోగులు, సాధారణ వ్యక్తుల నుంచి సేకరించిన నమూనాల్లో వైరస్ జాడను పసిగట్టే సామర్థ్యం కుక్కలకు ఉందో లేదో పరీక్షించారు. ఈ పరీక్షలో లో 4 కుక్కలు సమర్దవంతంగా పనితీరును కనబర్చాయి. 1వందకు వంద శాతం కరోనా రోగులను పసిగట్టేశాయి. 8 కుక్కల్లో 4 కుక్కలు వందకు వంద శాతం కరోనా పాజిటివ్ శాంపుల్ ఏదో ఈజీగా చెప్పేశాయి. దీంతో మరిన్ని కుక్కలకు ట్రైనింగ్ ఇచ్చి వాటి ద్వార కరోనా రోగులను గర్తించేందుకు సన్నాహాలు చేస్తున్నారు నిపుణులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here