చంద్రబాబు పై లక్ష్మీ పార్వతి పిటీషన్ కొట్టేసిన ఏసీబీ కోర్టు

chandra babu and lakshmi parvathi

హైదరాబాద్ – మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడుపై వైసీపీ నేత లక్ష్మీపార్వతి వేసిన పిటిషన్‌ను ఏసీబీ కోర్టు కొట్టివేసింది. చంద్రబాబు ఆస్తులపై విచారణ జరపాలని లక్ష్మీపార్వతి 2005లో ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ పై విచారించేందుకు అర్హతలేదని, అందుకు తగిన ఆధారాలు కూడా లేవని ఏసీబీ కోర్టు స్పష్టం చేసింది. దీంతో ఈ కేసు నుంచి చంద్రబాబుకు ఊరట లభించింది. 2004 ఎన్నికల అఫిడవిట్‌లో చంద్రబాబు చూపిన ఆస్తుల వివరాల ఆధారంగా ఏసీబీ కోర్టులో లక్ష్మీపార్వతి పిటిషన్ దాఖలు చేశారు. 1987 నుంచి 2005 మధ్య చంద్రబాబు భారీగా ఆస్తులు పెంచుకున్నారని, విచారణ జరపాలని ఏసీబీ కోర్టులో వేసిన పిటిషన్‌లో ఆమె పేర్కొన్నారు.

అయితే ఈ పిటిషన్‌పై 2005లో హైకోర్టు స్టే ఇచ్చింది. పెండింగ్‌లో ఉన్న స్టేలు ఎత్తివేయాలని ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు ఆదేశించిన నేపధ్యంలో లక్ష్మీ పార్వతి పిటీషన్ పై విచారణ జరిపిన కోర్టు కేసును కొట్టేసింది.