కొవిడ్ వారియర్స్ ప్లాస్మా దానం చేసి ప్రాణదాతలు కావాలి- చిరంజీవి

WhatsApp Image 2021 05 03 at 11.14.49

హైదరాబాద్- కరోనా సెకండ్ వేవ్‌ ప్రభావం అంతకంతకు పెరిగిపోతోంది. కరోనా మహమ్మారి బారిన పడి ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. ఈ క్రమంలో కొవిడ్‌ వారియర్స్‌ ప్లాస్మాను దానం చేసి ప్రాణదాతలు కావాలని పిలుపునిచ్చారు మెగస్టార్ చిరంజీవి. ట్విట్టర్‌ వేదికగా కొవిడ్‌ వారియర్స్‌ ప్లాస్మాను దానం చేయాలని చిరంజీవి చెప్పారు. కొవిడ్ సెకండ్‌ వేవ్‌ చాలా మందిపై ప్రభావం చూపుతుందనే సంగతి మీ అందరికీ తెలిసిందే.. కొన్నిరోజుల ముందు మీరు కొవిడ్‌ నుంచి కోలుకుని ఉంటే, మీ ప్లాస్మాను దానం చేయండి.. దీని కారణంగా మరో నలుగురు కొవిడ్‌ను సమర్ధవంతంగా ఎదుర్కోగలరు.. వివరాల కోసం, గైడెన్స్‌ కోసం చిరంజీవి చారిట్రబుల్ ట్రస్ట్‌ను సంప్రదించాలని కోరుతున్నాను.. అని ట్రస్ట్‌ నెంబర్‌ను ట్వీట్ చేశారు చిరంజీవి.

ప్రతి క్కరు సమాజం కోసం కొంతైనా పాటు పడాలని చిరంజీవి విజ్ఞప్తి చేశారు.