ఆస్పత్రిలో చేరిన మంత్రి కేటీఆర్

హైదరాబాద్- తెలంగాణ మునిసిపల్, పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌ ఓ కార్పోరేట్ ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం. ఏప్రిల్‌ 23న కేటీఆర్ కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దాందో అప్పటి నుంచి ఆయన హోం ఐసొలేషన్‌లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. ఐతే కేటీఆర్ కు గత రెండు రోజుల నుంచి కరోనా లక్షణాలు తీవ్రమైనట్లు తెలుస్తోంది. ఈమేరకు ఆయన శుక్రవారం ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం. డాక్టర్ల సలహా మేరకు శుక్రవారం సోమాజిగూడ లోని యశోధా ఆస్పత్రిలో చేరినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం.

ఐతే ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ కు సైతం కరోనా సోకడంతో ఆయన కూడా యశోదా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఐతే కేసీఆర్ కు నిర్వహించిన కొవిడ్ టెస్ట్ లో ఫలితం సరిగ్గా రాకపోవడంతో మరోసారి ఆయనకు కరోనా పరీక్ష చేయనున్నారు.