జాంబిరెడ్డి సీక్వెల్ – అంతకు మించి!..

అ! సినిమాతో దర్శకుడిగా పరిచయమైన ప్రశాంత్ ఆ తరువాత చేసిన కల్కి సినిమా అనుకున్నంత రేంజ్ లో హిట్టవ్వలేదు. ఇక ఇప్పటివరకు తెలుగులో ఎవరు ట్రై చేయని తరహాలో జాంబీస్ కాన్సెప్ట్ తో రాగా ఓ వర్గం జనాలను ఆ సినిమా బాగానే ఆకట్టుకుంది. అయితే సినిమా హిట్ టాక్ అందుకోగానే దర్శకుడు ప్రశాంత్ తప్పకుండా సీక్వెల్ ఉంటుందని క్లారిటీ ఇచ్చాడు. ఇక ఇప్పుడు అదే పనిలో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. జాంబీ రెడ్డి సీక్వెల్ అంతకు మించి అనేక థ్రిల్ ఇస్తుందట. ఆల్ మోస్ట్ స్క్రిప్ట్ పనులన్ని కూడా పూర్తయినట్లు సమాచారం. ఇక ఈ సినిమాను సమంతతో తెరకెక్కించే అవకాశం ఉన్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కానీ అందులో నిజం లేదు. దర్శకుడు ప్రశాంత్ సమంతతో ఒక సినిమా చేయాలనుకున్న మాట వాస్తవమే. కానీ అది వేరే స్టోరీ.జాంబి హాస్యభరిత కథాచిత్రం ‘జాంబిరెడ్డి’కి త్వరలో సీక్వెల్​ రానుంది. ప్రస్తుతం స్క్రిప్ట్​ పనులు జరుగుతున్నాయి. అధికారిక ప్రకటన మరికొద్ది రోజుల్లో వచ్చే అవకాశముంది.

jambi reddy

టాలీవుడ్​లో తొలిసారి జాంబీ నేపథ్య కథతో తెరకెక్కించిన సినిమా ‘జాంబిరెడ్డి’. కొన్నాళ్ల క్రితం తొలుత థియేటర్లలో, ఆ తర్వాత ఓటీటీలో ప్రేక్షకులను అలరించింది. సినిమా రిజల్ట్ సంగతి పక్కన పెడితే అతని కంటెంట్ చూసి చాలా మంది నిర్మాతలు ఛాన్సులు ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. ఇక మొత్తానికి జాంబీ రెడ్డి సినిమాతో పరవాలేదు అనిపించిన ప్రశాంత్ వర్మ ఈసారి అంతకు మించి అనేలా హిట్ కొట్టాలని చూస్తున్నాడు. జాంబీ రెడ్డి 2 అనంతరం మంచి నిర్మాత దొరికితే వెంటనే ఆ సినిమాను స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు. మరి దర్శకుడు ప్రశాంత్ వర్మ ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటాడో చూడాలి