సమంతాకి టాలీవుడ్ షాక్.. పాపం సామ్!

samantha industry

అంతా అనుకున్నట్టే జరిగింది. టాలీవుడ్ క్యూట్ పెయిర్ నాగచైతన్య-సమంత విడిపోయారు. తమ విడాకులతో లక్షల మంది అభిమానులకు షాక్ ఇచ్చారు. విడాకులు అన్నవి పూర్తిగా వారి వ్యక్తిగత అంశమైనా.. ప్రేక్షకులు ఈ విషయాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. అయితే.., సామ్ ఇంత పెద్ద నిర్ణయానికి రావడానికి ప్రధాన కారణం సినిమాలే. కెరీర్ పరంగా తనకు ఎలాంటి బ్రేక్స్ ఉండకూడదనే సమంత ఈ విషయంలో వెనక్కి తగ్గలేదని సమాచారం. అయితే.., ఏ సినిమా అవకాశాల కోసమైతే సామ్ ఇంత పెద్ద నిర్ణయం తీనుకుందో, ఇప్పుడు అదే సినీ ఇండస్ట్రీ సమంతాని దూరం పెట్టబోతోందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.

తెలుగు సినిమాని అక్కినేని కుటుంబాన్ని వేరుగా చూడలేము. తెలుగు సినిమా తమిళనాట నలిగిపోతున్న కాలంలో టాలీవుడ్ ని హైదరాబాద్ కి తీసుకొచ్చిన ఘనత అక్కినేని కుటుంబానికే దక్కుతుంది. ఈ నాటికీ పెద్ద పెద్ద నిర్మాతలు అందరూ అక్కినేని కుటుంబాన్ని కాదని ఏ పని చెయ్యరు, చేయలేరు కూడా. ఇదే సమయంలో దగ్గుబాటి వారి స్థాయి కూడా తక్కువ ఏమి కాదు. ఈ రెండు కుటుంబాలకి చెందిన నాగచైతన్యకి విడాకులు ఇవ్వడంతో.., ఇప్పుడు ఇండస్ట్రీలోని మేకర్స్ అంతా సామ్ కి దూరంగా ఉండిపోయే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది.

samantha nagachaithanya tollywoodస్టార్ హీరోలు సైతం అక్కినేని ఫ్యామిలీతో స్నేహాన్ని వదులుకుని మరీ సమంతాకి ఛాన్స్ లు ఇస్తారని ఊహించలేము. సో.. భారీ బడ్జెట్ సినిమాల్లో కూడా సామ్ కి దారులు మూసుకుని పోయినట్టే అన్న చర్చ నడుస్తోంది. ఇవన్నీ పక్కన పెడితే సమంతాకి ఇప్పుడు 34 సంవత్సరాలు. ఈ వయసులో ఆమెకి ఇది వరకులా అవకాశాలు క్యూ కట్టవు. కాబట్టి.. ఎలా చూసుకున్నా టాలీవుడ్ లో సమంతాకి రానున్న కాలం.. కష్టంగానే కనిపిస్తోంది. అయితే.., సామ్ లో కోలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ ఉంది. మరి.. ఇక నుండి సమంతా తన ప్రయత్నాలను అక్కడ మొదలు పెడుతుందేమో చూడాలి. ఏదేమైనా.. సామ్ సినీ కెరీర్ పై మాత్రం అప్పుడే రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. మరి.. సామ్ మళ్ళీ తన స్థాయికి తగ్గ అవకాశాలను అందుకోగలదా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.