సమంత ఆ విషయంలో యన్టీఆర్ నే ఎందుకు నమ్మింది?

meelo evaru koteeswarudu

ఈ మధ్య కాలంలో ప్రధానంగా ఏ చిత్ర పరిశ్రమలోకి తొంగి చూసినా ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరో, హీరోయిన్ ల వివాహం బంధం మూన్నాళ్ల ముచ్చటగానే మారిపోతోంది. ఇద్దరు ఒకే రంగంలో ఉండటం కారణంగా ఒకరిపై ఒకరికి అనుమానాలు రావటం, ఇద్దరి మధ్య భిన్నాభిప్రాయాలు తలెత్తడంతో చివరికి వారి వివాహ బంధం విడాకుల వరకు వస్తున్నాయి. ఇలా ఎంతో మంది నటీనటులు విడాకులు తీసుకోవటం అనేది అందరికీ కామన్ గా మారింది.

ఈ నేపథ్యంలో తెలుగు చిత్ర పరిశ్రమలో క్యూట్ కపుల్ గా పేరుతెచ్చుకున్న సమంత-నాగచైతన్య విడాకులు తీసుకుంటున్నామంటూ అధికారికంగా తెలిపిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే అంశం టాలీవుడ్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే భార్యభర్తల వివాహ బంధం విడాకుల వరకు వెళ్లిందంటే సమాజం ఖచ్చితంగా భార్యపైనే ఎన్నో అనుమానాలను లేవనెత్తుతారు. ఇక ఇరుగు పొరుగు వారు వేసే నిందలు భరించలేక ఆ మహిళ మానిసికంగా కృంగిపోయి తీవ్ర మనోవేదనకు గురవుతుంది. ఇప్పుడు ఇదే కోవలోకి వెళ్తోంది నటి సమంత.

meelo evaru koteeswaruduఅవును.. మీరు విన్నది నిజమే. నాగ చైతన్యతో విడాకులకు సమంత వ్యవహారమే కారణమని ఓ వర్గం నటులు భావిస్తున్నారు. దీంతో పాటు ఫ్యాషన్ డిజైనర్ ప్రతీమ్ జుకల్కర్ తో సమంత ఏదో రిలేషన్ లో ఉందని కూడా వార్తలు వినిపించటం దీనికి బలం చేకూర్చినట్లు అవుతుంది. ఇలాంటి వార్తల నడుమ సమంత ఏం చేయాలో తెలియక తికమకలో ఎటూ తేల్చుకోలేకపోతోందని తెలుస్తోంది. ఇక ఈ కఠినమైన పరిస్థితుల్లో గుచ్చుకునేలా ఉన్న ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటే త్వరగా స్రీన్ పై కనిపించటమే బెటర్ వేవ్ అని సమంత అనుకున్నట్లు సమాచారం.

అయితే ఈ క్రమంలోనే యన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు షోలో సమంత గెస్ట్ గా వెళ్లేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. తన బరువెక్కిన హృదయంలో నిండిన బాధను దిగమింగుకునేందుకు సమంత ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇతర వ్యక్తుల బాధను తెలుసుకుని తనదైన శైలీలో స్పందించగల నేర్పు యన్టీఆర్ సొంతం. ఈ కారణంతోనే సమంత యన్టీఆర్ ని నమ్మి ఈ షోకు వెళ్లేందుకు గ్రీన్ సిగ్నిల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరి ఈ షోలో నాగ చైతన్య గురించే కాకుండా విడాకుల ప్రస్తావనపై ఏ విధమైన సమాధానాలు చెబుతుందో అని అందరు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.