సమంతకు వనితా విజయ్‌ సపోర్ట్‌.. మండిపడుతున్న అక్కినేని ఫాన్స్!

Vanita Vijaykumar Supports to Samantha - Suman TV

నాగచైతన్య-సమంత విడిపోయిన తర్వాత చైతూ కంటే కూడా స్యామ్‌పైనే ఎక్కువగా విమర్శలు వచ్చాయి. పిల్లలు వద్దనుకుందని, ఎవరితోనో అఫైర్‌ పెట్టుకుందనే ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో తనపై అనవసరంగా నిందలు వేస్తున్నారని సమంత సోషల్‌మీడియాలో తనపై వస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. కాగా తమిళ నటి, ప్రముఖ నటుడు విజయ్‌కుమార్‌ కూతురు వనితా విజయ్‌ కుమార్‌ సమంతకు మద్దతు తెలుపుతూ.. ‘ఇక్కడ సమాజం లేదు బేబి, నీ జీవితం నువ్వు జీవించు.. మనం తీసుకునే ఫోటోలు మాత్రమే జనాలు చూస్తారు. అసలు వాస్తవాలు పట్టించుకోరు. జీవితం చాలా విలువైనది. అనవసరంగా బాధపడకు, అన్నిటికీ ఒక కారణం ఉంటుంది. జీవితంలో ముందుకు సాగు’ అంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో చెప్పుకోచ్చారు.

Vanita Vijaykumar Supports to Samantha - Suman TVకానీ సమంత అభిమానుల నుంచి మాత్రం దీనిపై వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. మూడు పెళ్లిళ్లు చేసుకున్న నీ లాంటి వారి సలహాలతో సమంత జీవితం నాశనం అవుతోందని మండిపడుతున్నారు. మరి వనితా విజయ్‌ కుమార్‌ సమంతకు ఇచ్చిన సలహాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.