పవన్ కళ్యాణ్ “వకీల్ సాబ్” కు సీక్వెల్ రాబోతోందా..

vakeel saab

ఫిల్మ్ డెస్క్- పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ వకీల్‌సాబ్ బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది. దీంతో ఇటు పవన్ కళ్యాణ్, అటు నిర్మత దిల్ రాజు, మరోవైపు పవన్ ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారు. పవన్ మూడేళ్ల తరువాత నటించిన వకీల్ సాబ్ విజయం సాధించడంతో పవన్ ఈ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇటువంటి సమయంలో వకీల్ సాబ్ పై సీక్వెల్ వార్త ఒకటి హల్ చల్ చేస్తోంది. తమ అభిమాన హీరో నటించిన వకీల్ సాబ్ కు సీక్వెల్ రావాలని పవన్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. వకీల్ సాబ్ సినిమా సీక్వెల్ మాట ఆ నోటా ఈ నోట పలికి.. చివరికి ఈ సినిమా డైరెక్టర్ వేణు శ్రీరామ్‌కి చెవిన పడింది.

దీంతో ఆయన కూడా వకీల్‌సాబ్ సీక్వెల్‌పై ఇంట్రస్ట్ చూపిస్తున్నారట. ఇటీవల ఓ సందర్బంలో వకీల్ సాబ్ సినిమా సీక్వెల్‌పై వేణు శ్రీరామ్ దగ్గర ప్రస్తావించగా.. ముందు మాకు సీక్వెల్ ఆలోచన లేదని.. ఐతే పవన్ అభిమానులు బలంగా కోరుకోవడంతో.. నాక్కూడా వకీల్ సాబ్ సీక్వెల్ పై ఆలోచన వస్తోందని అన్నారట. అంతే కాదు ఈ విషయంపై తాను పవన్‌ కళ్యాణ్, దిల్‌ రాజులతో చర్చిస్తానని కూడా చెప్పారట డైరెక్టర్ వేణు శ్రీరామ్. ఒవకీల్ సాబ్ సీక్వెల్ కు పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే కధ రెడీ చేసేందుకు తాను రెడీ అని కూడా చెప్పేస్తున్నాడు.

చెప్పడమే కాదు మరో సామాజిక అంశంతో వకీల్‌ సాబ్ సీక్వెల్‌ కధను ఇప్పటి నుంచే సిద్దం చేసే పనిలో ఉన్నాడట శ్రీరామ్. ఐతే వకీల్‌ సాబ్ తర్వాత పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు, అయ్యప్పనుమ్ కోశియమ్ సినిమా రీమేక్‌లలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌లు వాయిదాపడ్డా.. కరోనా పరిస్థితు చక్కబడగానే మళ్లీ సెట్స్ పైకి వెళ్లనున్నాయి. దీంతో ఈ సినిమాలు పూర్తి చేసే సరికి కనీసం మూడేళ్లైనా పడుతుందని తెలుస్తోంది. అందుకే ఈ సినిమాలు పూర్తయ్యాకే వకీల్ సాబ్ సీక్వెల్ పై పవన్ ఆలోచిస్తారని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి.